Viral Video: టికెట్ తీసుకున్న వ్యక్తిని బోగీలోకి రాకుండా తలుపులు వేశారు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ABN, Publish Date - Apr 19 , 2024 | 04:50 PM
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు కొందరైతే.. మరికొందరు బోగీలోకి వచ్చాక సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా..
రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు కొందరైతే.. మరికొందరు బోగీలోకి వచ్చాక సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. టికెట్ తీసుకున్న వ్యక్తిని బోగీలోకి రాకుండా చాలా మంది తలుపులు మూసి అడ్డుకున్నారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. టికెట్ లేని చాలా మంది ప్రయాణికులు బోగీ డోరు (Train bogie) వద్ద నిలబడి ఉంటారు. అప్పటికే బోగీ నిండిపోయి ఉంటుంది. దీంతో బయటి నుంచి ఎవరూ లోపలికి రాకుండా (ticketless passengers block bogie door) డోరు వేసేస్తారు. ఇంతలో టికెట్ తీసుకున్న ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. డోరు తీయాలని ఎంత అడిగినా లోపల ఉన్న వారు వినిపించుకోరు.
డోరు తీయకపోవడంతో చివరకు అతడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. చివరకు బోగీ డోరు అద్దాలను రాయితో కొట్టి ధ్వంసం చేస్తాడు. ఊహించని ఈ ఘటనతో లోపల ఉన్న ప్రయాణికులంతా షాక్ అవుతారు. డోరు వద్ద నుంచి దూరంగా వెళ్లిపోతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బయట ఉన్న వ్యక్తి కోపం సరైనదే’’.. అంటూ కొందరు, ‘‘రైళ్లలో ప్రయాణం తగ్గించుకోవడం బెటర్’’.. అంటూ మరికొందరు, ‘‘దీనికి, ప్రభుత్వానికీ సంబంధం లేదు’’.. అంటూ ఇంకొంరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Puzzle: మీకో ఛాలెంజ్.. ఈ కొండలో దాక్కున్న జింకను.. 30 సెకన్లలో కనిపెట్టగలరా..
Updated Date - Apr 19 , 2024 | 04:50 PM