Viral Video: పామును చూసి వణికిపోయిన పులి.. రోడ్డుపై కోబ్రా ఎదరుపడగానే.. ఒక్కసారిగా..

ABN, Publish Date - Aug 11 , 2024 | 08:11 AM

ధైర్యానికి చిహ్నంగా పులులు, సింహాలను పోల్చుతుంటాం. అందుకు తగ్గట్టుగానే అవి కూడా ఏం జంతువుకూ భయపడవు. వాటి కంట పడ్డ ఏవైనా చివరకు ప్రాణాలు వదలాల్సిందే తప్ప.. పులులు, సింహాలు మాత్రం వెనక్కుతగ్గవు. అయితే కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు.. అన్నట్లుగా..

Viral Video: పామును చూసి వణికిపోయిన పులి.. రోడ్డుపై కోబ్రా ఎదరుపడగానే.. ఒక్కసారిగా..

ధైర్యానికి చిహ్నంగా పులులు, సింహాలను పోల్చుతుంటాం. అందుకు తగ్గట్టుగానే అవి కూడా ఏం జంతువుకూ భయపడవు. వాటి కంట పడ్డ ఏవైనా చివరకు ప్రాణాలు వదలాల్సిందే తప్ప.. పులులు, సింహాలు మాత్రం వెనక్కుతగ్గవు. అయితే కాలం అన్నిసార్లు ఒకేలా ఉండదు.. అన్నట్లుగా కొన్నిసార్లు వీటికీ గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పులికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న పులికి సడన్‌గా నాముపాము కనిపించింది. దీంతో భయపడిపోయిన పులి రోడ్డుపై సైలెంట్‌గా పడుకుండిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) చంద్రాపూర్‌లోని తడోబా టైగర్ రిజర్వ్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తుంటుంది. ఏదైనా ఎదురుపడితే వెంటనే వేటాడాలని చూస్తూ ఉంటుంది. ఇంతలో పులికి ఊహించని షాక్ తగులుతుంది. కాస్త దూరం వెళ్లగానే ఓ పిల్ల కాలువ వద్ద సడన్‌గా నాగు పాము కనిపిస్తుంది.

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..


పులి సమీపానికి రాగానే పాము పడగ విప్పి బుసలుకొడుతుంది. నాగుపామును చూడగానే (tiger stopped in fear when he saw the cobra) పులి భయంతో అక్కడే ఆగిపోతుంది. కాలువ అవతలి వైపు పులి, ఇవతలి వైపు నాగుపాము ఉంటాయి. నాగుపాము పడగ విప్పి పులిని చూస్తూ అలాగే ఉంటుంది. పులి కూడా భయంతో ఎటూ కదల్లేక అక్కడే పడుకుని నాగుపాము వెళ్లిపోతే తాను వెళ్లిపోవాలని చూస్తుంటుంది. అయితే నాగుపాము మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది.

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..


పక్కకు కదిలితే పాము ఎక్కడ కాటేస్తుందో.. అనే భయంతో పులి కూడా అలాగే కదలకుండా ఉండిపోతుంది. ఇలా ఆ రెండూ సుమారు 30 నిముషాల పాటు అక్కడే ఉండిపోతాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులికి చుక్కలు చూపించిన నాగుపాము’’.. అంటూ కొందరు, ‘‘ఎన్నాళ్ల నుంచి మనుసులో పెట్టుకుందో ఏమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Viral Video: అది రైలు అనుకున్నారా.. లేక పార్క్ అనుకున్నారా.. బోగీపై ఈ ప్రేమికుల నిర్వాకం చూస్తే..

Updated Date - Aug 11 , 2024 | 08:12 AM

Advertising
Advertising
<