Share News

Viral Video: జింకను సులభంగానే చంపేసింది కానీ, దానిని తీసుకెళ్లడానికి పులి ఎన్ని ఆపసోపాలు పడుతోందో చూడండి..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 08:45 AM

జంతువులను వేటాడడంలో పులిని మించిన వన్య ప్రాణి మరొకటి లేదనే చెప్పాలి. సింహం కంటే కూడా పులికి వేట నైపుణ్యాలు ఎక్కువ. పులి కంట పడిన ఏ జంతువైనా దానికి ఆహారం కావాల్సిందే. పులి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే నెట్టింట హల్‌చల్ చేశాయి.

Viral Video: జింకను సులభంగానే చంపేసింది కానీ, దానిని తీసుకెళ్లడానికి పులి ఎన్ని ఆపసోపాలు పడుతోందో చూడండి..!
A tiger dragging its prey

జంతువులను వేటాడడంలో పులిని (Tiger) మించిన వన్య ప్రాణి మరొకటి లేదనే చెప్పాలి. సింహం కంటే కూడా పులికి వేట (Hunting) నైపుణ్యాలు ఎక్కువ. పులి కంట పడిన ఏ జంతువైనా దానికి ఆహారం కావాల్సిందే. పులి వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Tiger Hunting Videos) ఇప్పటికే నెట్టింట హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్క్‌ (Ranthambore National Park )లో ఓ పర్యాటకుడు ఈ వీడియోను చిత్రీకరించాడు (Viral Video).


ranthambhorepark అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పులి ఓ భారీ జింకను వేటాడింది. వేట కాస్త సులభంగానే అయిపోయి ఉంటుంది కానీ, ఆ భారీ జింకను తన స్థావరానికి తీసుకెళ్లడానికి పులి చాలా కష్టపడింది. భారీ శరీరాన్ని తన నోటితో ఈడ్చుకుంటూ వెళుతూ మధ్య మధ్యలో ఆగుతోంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ వేటను ఓ పర్యాటకుడు వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆ స్థలం వేరే పులి ఆధీనంలో ఉంది``, ``చూస్తుంటే ఆ జింక ప్రెగ్నెంట్‌లా ఉంది``, ``రణతంబోర్‌లో ఇలాంటి దృశ్యాలు చాలా కనబడతాయి``, ``చాలా భయానకం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఆ రెండు ఫొటోల్లోని 3 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


Microsoft Engineer: లక్షల్లో సంపాదించే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్.. వారాంతంలో ఎందుకు ఆటో నడుపుతున్నాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 24 , 2024 | 08:45 AM