ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: మీరు తాగే పాలు కూడా ఇలాంటివే కావొచ్చు.. ఈ వ్యాపారి చేస్తున్న పని చూస్తే..

ABN, Publish Date - Jun 20 , 2024 | 03:21 PM

‘‘కాదేదీ కవితకు అనర్హం’’.. అన్న చందంగా.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకూ మనం తినే ఆహారాన్ని కల్తీ చేసేస్తున్నారు. ఒకప్పుడు అన్ని రకాల...

‘‘కాదేదీ కవితకు అనర్హం’’.. అన్న చందంగా.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకూ మనం తినే ఆహారాన్ని కల్తీ చేసేస్తున్నారు. ఒకప్పుడు అన్ని రకాల వ్యాపారాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించే వ్యాపారులు.. ప్రస్తుతం గాలికొదిలేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీకి పాల్పడే వ్యాపారులకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాల వ్యాపారి చేసిన పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర అమరావతి (Maharashtra Amaravati) జిల్లాలోని MIDC ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ వ్యాపారి పాల క్యాన్లను బైకులో పెట్టుకుని వినియోగదారుల వద్దకు తీసుకెళ్తుంటాడు. అయితే ఈ క్రమంలో మార్గ మధ్యలో ఓ ప్రాంతంలో బైకును నిలిపేస్తాడు. ఏం చేస్తున్నాడని గమనించగా.. బైకు దిగి అటు పక్కనే ఉన్న మురికి నీళ్ల (man mixed impure water in milk) తొట్టి నుంచి నీళ్లను తీసుకుని పాలలో కలిపేస్తాడు.

Viral video: రైలు దిగే సమయంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దు.. ఇతడు చేసిన పని చూడండి..


ఇలా పాల క్యాన్లను ఫుల్ చేసుకున్న తర్వాత.. వినియోగదారుల వద్దకు తీసుకెళ్తాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటే.. పాలు తాగాలంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jun 20 , 2024 | 04:23 PM

Advertising
Advertising