ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: శునకంపై సిబ్బంది ప్రతాపం.. మొహంపై కొట్టి, కాలితో తన్నుతూ పైశాచిక ఆనందం

ABN, Publish Date - Feb 14 , 2024 | 11:05 AM

థానేలో ఓ పెట్ క్లినిక్ సిబ్బంది చౌ చౌ జాతికి చెందిన శునకంపై దాడి చేశారు. ఆ శునకం మొహంపై కొట్టి, కాలితో తన్ని పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

థానే: పెంపుడు జంతువుల సంరక్షణ చూడటం పెట్ క్లినిక్ సిబ్బంది బాధ్యత. థానేలో గల ఓ కేందరంలో ఇద్దరు సిబ్బంది మాత్రం అనుచితంగా ప్రవర్తించారు. నోరు లేని మూగ జీవంపై తమ ప్రతాపాన్ని చూపారు. చౌ చౌ జాతికి చెందిన శునకంపై కసి తీర కొట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సిబ్బంది తీరును జంతు ప్రేమికులు ఖండించారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై మంగళవారం థానే పోలీసులు (Thane Police) కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మొహంపై కొట్టి, కాలితో తన్ని

చౌ చౌ జాతికి చెందిన శునకాన్ని (కుక్క) సిబ్బంది కొట్టారు. శునకం మొహంపై పదే పదే కొట్టారు. తర్వాత కాలితో కనికరం లేకుండా తన్నారు. స్ట్రెచర్ దిగి వెళ్లిపోతున్న శునకాన్ని కూడా వదల్లేదు. దానిని తన్ని పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. జంతు ప్రేమికులు మండిపడ్డారు. పెట్ యానిమల్స్ అసోసియేషన్ సభ్యులు నిలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకంపై దాడి చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు కోరారు. ఘటనపై నెటిజన్లే కాదు బాలీవుడ్ నటులు కూడా స్పందించారు. వీడియో తెగ చక్కర్లు కొట్టడంతో శునకాన్ని కొట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ శునకం ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 11:05 AM

Advertising
Advertising