ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Budget 2024-25: నిర్మలమ్మ కట్టుకున్న బ్లూ చీర ప్రత్యేకలు ఏంటంటే..

ABN, Publish Date - Feb 01 , 2024 | 03:21 PM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 బడ్జెట్‌ని ఆమె గురువారం ఉదయం లోక్​సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికంటే ముందు..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. లోక్ సభ ఎన్నికల ముందు వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 బడ్జెట్‌ని ఆమె గురువారం ఉదయం లోక్​సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికంటే ముందు నిర్మలా సీతారామన్.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ విషయం ఇలా వుండగా.. ఈ సందర్భంగా ఆమె ధరించిన చీర గురించి నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చేనేత చీరలపై మక్కువ చూపించే నిర్మలా సీతారామన్.. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తన వినూత్న డిజైన్లతో కూడిన చీరలను ధరించడం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సారి ఆమె.. నీలం, క్రీం రగు టస్సార్ చీరను ధరించారు. ఈ చీరకు సంబంధించిన కొన్ని విశేషాలు మీ కోసం..

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) .. నిత్యం సాంప్రదాయ వస్త్రధారణలోనే కనిపిస్తుంటారు. 2024 మధ్యంతర బడ్జెట్‌ (Budget 2024-25) ప్రవేశపెట్టే ముందు ఆమె భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కాంతా ఎంబ్రాయిడరీతో నీలం, క్రీమ్ ప్రింటెడ్ సిల్క్ చీరను ధరించారు. ఈ ఎంబ్రాయిడరీ పశ్చిమ బెంగాల్‌లోని హస్తకళాకారులు చేసే ప్రత్యేకమైన థ్రెడ్ డిజైన్ అని తెలిసింది. అయితే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆమె ధరించే చీరలు కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంటాయి. సహజంగానే భారతీయ వస్త్రాలపై మక్కువ చూపించే ఆమె.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భాల్లో తాను ధరించే చీరల ద్వారా కూడా తన అభిరుచిని గుర్తు చేస్తుంటారు.


నిర్మలా సీతారామన్‌కు క్రీమ్ కలర్ రంగు ఎంతో ఇష్టం. దీంతో ఆమె ఎక్కువగా ఈ రంగు చీరలనే ధరిస్తుంటారు. 2022 బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో రస్టీ బ్రౌన్ బొమ్కయి చీర ధరించగా.. 2021లో ఎరుపు, తెలుపుతో ఉన్న పోచంపల్లి చీరను ధరించారు. 2020లో నీలం అంచుతో ఉన్న పసుపు రంగు చీరను ధరించారు. అలాగే 2019లో గోల్డెన్ బార్డర్‌తో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీరలో కనిపించారు. గత ఏడాది నవలగుండ ఎంబ్రాయిడరీని చేతితో నేసిన ఎరుపు రంగు ఇల్కల్ చీరను మంత్రి ధరించారు. ఈ చీరను కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన మంత్రి ప్రహ్లాద్ జోషి.. బహుమతిగా అందించిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌.. గతంలో అనేక ప్రత్యేక సందర్భాల్లో ధరించిన చీరలు కూడా అందరి దృష్టినీ ఆకర్షించాయి. అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగులో ఉండే మణిపురి చీర ధరించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ.20 రంగులో పచ్చని మంగళగిరి చీరను ధరించారు. అదేవిధంగా గతంలో ఓసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీరలో కనిపించారు. మరోవైపు అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో రూ.500 నోటు కలర్ చీరను ధరించిన విషయం తెలిసిందే.

బడ్జెట్‌ ప్రవేశ పెట్టే సందర్భంలో చేత్తో నేసిన చీరలే కాకుండా, ఆమె చేతిలోని రెడ్ కలర్‌ బ్యాగ్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. సాధారణనాకి భిన్నంగా ఆమె.. 2019లో ఈ రెడ్ బ్యాగ్‌ను మొదటి బడ్జెట్‌కు తీసుకొచ్చారు. అప్పటినుంచి వరుసగా ఇదే బ్యాగ్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఉండే ట్యాబ్ ద్వారా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. కాగా, మోదీ సర్కారుకు ఇదే చివరి బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 7 శాతానికి చేరుకోగలదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సమీక్షలో పేర్కొంది.

Updated Date - Feb 05 , 2024 | 12:59 PM

Advertising
Advertising