Kavita: చనిపోయిందనుకున్నారు.. ప్రియుడితో అడ్డంగా దొరికిపోయింది.. కవితా మజాకా
ABN, Publish Date - Oct 08 , 2024 | 08:31 PM
వివాహమైన మూడేళ్లకు భర్తను కుటుంబాన్ని వదిలి ప్రియుడి వద్దకు ఓ యువతి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఏమి తెలియని ఆ యవతి కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను ఏదో చేసి మాయం చేశాంటూ.. ఆమె అత్తవారింటి మీద పోలీస్ కేసు పెట్టారు. తమకు ఏ పాపం తెలియదంటూ.. తన భార్యను పుట్టింటి వారే ఏదో చేశారంటూ అతడు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహమైన మూడేళ్లకు భర్తను కుటుంబాన్ని వదిలి ప్రియుడి వద్దకు ఓ యువతి వెళ్లిపోయింది. అయితే ఈ విషయం ఏమి తెలియని ఆ యవతి కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను ఏదో చేసి మాయం చేశాంటూ.. ఆమె అత్తవారింటి మీద బంధువులు పోలీస్ కేసు పెట్టారు. తమకు ఏ పాపం తెలియదంటూ.. తన భార్యను పుట్టింటి వారే ఏదో చేశారంటూ అతడు.. తన అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: South Central Railway: దసరా వేళ.. 770 ప్రత్యేక రైళ్లు
దీంతో ఆ యువతి పుట్టినింటి వారు.. మెట్టినింటి వారు.. ఒకరుపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో ఒక కుటుంబంపై మరో కుటుంబం హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేసుకున్నాయి. ఇంతలో రోజులు, నెలలు, ఇలా ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. కానీ ఆ యవతి ఏమైందనే విషయం మాత్రం ఎవరికీ అంతు బట్టలేదు. పోలీసులు సైతం ఈ కేసు దర్యాప్తు చేసి.. ఆమె చనిపోయి ఉంటుందంటూ కేసు మూసి వేసేందుకు సిద్దమయ్యారు.
Also Read: బత్తాయి తింటే ఇన్ని లాభాలున్నాయా..?
చివరకు ఈ కేసు పంచాయతీ కాస్తా ఉత్తరప్రదేశ్ హైకోర్టుకు చేరింది. దీంతో ఈ కేసులో అదృశ్యమైన యువతి జాడ కనుక్కోవాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ క్రమంలో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి మూడేళ్లుగా ఆమె షికారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Dasara Navaratri 2024: శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యమైన రోజు.. ఎప్పుడంటే..?
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. గోండా ప్రాంతానికి చెందిన కవిత 2017, నవంబర్ 17న స్థానిక దడ్వా బజార్‌కు చెందిన వినయ్ కుమార్‌తో వివాహం జరిగింది. అయితే 2021, మే 05వ తేదీన కవిత ఒక్కసారిగా అదృశ్యమైంది. దీంతో కవిత పుట్టింటి వారు.. తమ కుమార్తెను ఏదో చేశారంటూ ఆమె అత్తింటివారిపై ఆరోపణలు గుప్పించారు. కాదు కాదు మీ అమ్మాయిని మీరే ఏదో చేసి మా మీద నేరం మోపుతున్నారంటూ కవిత అత్తమామలు, భర్త ప్రత్యారోపణలు చేశారు.
Also Read: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు
దీంతో ఈ కేసు పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి మూడేళ్ల పాటు దర్యాప్తు చేసినా.. ఫలితం మాత్రం దక్కలేదు. దాంతో ఈ ఇరు కుటుంబాలు ఈ అంశాన్ని ప్రేస్టేజ్ ఇష్యూగా తీసుకుని హైకోర్టును ఆశ్రయించాయి. అంతే కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులకు కవిత ఆచూకీ దొరికింది. లక్నోకు చెందిన సత్యనారాయణ గుప్తా.. గోండాలోని స్థానిక మార్కెట్‌లో షాప్ నిర్వహిస్తున్నాడు.
ఆ క్రమంలో అతడికి కవితకు పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఒక రోజు.. ఎవరికీ చెప్పాకుండా అతడితో వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తెలిసింది. తోలుత సత్యనారాయణ గుప్తపాతో ఆయోధ్యకు వెళ్లినట్లు చెప్పింది. అయితే ఏడాది క్రితం లక్నోకు వారు మకాం మార్చారు. కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో ఆమెను ప్రవేశ పెట్టనున్నారు. అందుకోసం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 08 , 2024 | 08:42 PM