Viral Video: తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. లిఫ్ట్‌లోకి వెళ్లిన చిన్నారి.. చివరకు జరిగింది చూస్తే..
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:47 PM
కొన్నిసార్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఫోన్ ధ్యాసలో పడి కొందరు, ఇంటి పనుల హడావుడిలో పడి ఇంకొందరు పిల్లలను గాలికొదిలేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చివరకు ఏవేవో వస్తువులను మింగడం, ట్యాంకుల్లో పడిపోవడం వంటి షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..
కొన్నిసార్లు తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఫోన్ ధ్యాసలో పడి కొందరు, ఇంటి పనుల హడావుడిలో పడి ఇంకొందరు పిల్లలను గాలికొదిలేస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ చివరకు ఏవేవో వస్తువులను మింగడం, ట్యాంకుల్లో పడిపోవడం వంటి షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఓ పిల్లాడు ఇంట్లో నుంచి బయటికి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటుంటాడు. ఈ క్రమంలో చివరకు అక్కడే ఉన్న ఓ లిఫ్ట్‌లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే (child stuck in elevator) లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. తర్వాత ఆ పిల్లాడు లోపల ఉన్న ఫ్లోర్ నంబర్లను నొక్కేస్తాడు.
Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..
దీంతో లిఫ్ట్ నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లిపోతుంది. అయితే అప్పటిదాకా సంతోషంగా ఉన్న పిల్లాడు.. ఆ తర్వాత ఒక్కసారిగా గుక్క పట్టి ఏడుస్తాడు. ఈలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్లీ పై అంతస్తులోకి వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘తల్లిదండ్రులు పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 2.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 06 , 2024 | 04:47 PM