Viral Video: నోరూరిస్తున్న పుచ్చకాయ బిర్యానీ.. దీని తయారీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Apr 21 , 2024 | 08:04 PM
బిర్యానీ అంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వారి కోసం చాలా మంది వ్యాపారులు వివిధ రకాల బిర్యానీలను అందుబాటులోకి తెస్తుంటారు. చికెన్, మటన్ బిర్యానీని వినూత్నంగా..
బిర్యానీ అంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి వారి కోసం చాలా మంది వ్యాపారులు వివిధ రకాల బిర్యానీలను అందుబాటులోకి తెస్తుంటారు. చికెన్, మటన్ బిర్యానీని వినూత్నంగా చేస్తూ, అందులో వింత వింత ప్లేవర్లను జత చేస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటుంటారు. ఇలాంటి వెరైటీ ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, పుచ్చకాయ చికెన్ బిర్యానీ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులంతా కలిసి పుచ్చకాయ చికెన్ బిర్యానీ (Watermelon Chicken Biryani) చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వారు పచ్చటి పొలాలను ఎంచుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వంట మొదలెట్టారు. ముందుగా చాలా పుచ్చకాయలను కట్ చేసి, దాన్నుంచి జ్యూస్ బయటకు తీసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత ఓ పెద్ద పాత్రలో చికెన్ ముక్కలను కడిగి పక్కన పెట్టకుంటారు.
Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..
ఆ తర్వాత నూనెలో మసాలాలు వేయించి, అందులో చికెన్ ముక్కలను వేస్తారు. అవి ఉడుకుతుండగానే అందులో పక్కన సిద్ధంగా ఉంచుకున్న బాస్మతి రైస్‌తో పాటూ పుచ్చకాయ జ్యూస్‌ను కూడా కలుపుతారు. ఇలా చివరకు ఘుమఘుమలాడే పుచ్చకాయ చికెన్ బిర్యానీని సిద్ధం చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా..!! వాట్ ఏ కాంబినేషన్’’.. అంటూ కొందరు, ‘‘పుచ్చకాయలను కలపడం కంటే.. విడిగా తింటేనే బాగుంటాయి’’.. అంటూ మరికొందరు, ‘‘దయచేసి బిర్యానీని ఇలా పాడు చేయకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఏసీ మిషన్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. శుభ్రం చేసేందుకు తెరిచిచూడగా..
Updated Date - Apr 21 , 2024 | 08:07 PM