ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు.. తీరా రాత్రి జరిగిన సీన్ చూసి అంతా షాక్...

ABN, Publish Date - Jul 17 , 2024 | 09:40 PM

ప్రస్తుతం చాలా మంది వివాహాల విషయంలో ఖర్చులకు వెనుకాడడం లేదు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ స్థాయికి మించి ఖర్చు చేసి తమ పిల్లల పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో..

ప్రస్తుతం చాలా మంది వివాహాల విషయంలో ఖర్చులకు వెనుకాడడం లేదు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ స్థాయికి మించి ఖర్చు చేసి తమ పిల్లల పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు లెక్కకు మించి అప్పులు చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు వివాహ కార్యక్రమాల్లో ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అప్పు చేసి మరీ ఏర్పాట్లు చేశాడు. అయితే రాత్రికి మంటపంలో పరిస్థితి చూసి అంతా షాక్ అయ్యారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన కుమార్తె వివాహాన్ని (marriage) ఘనంగా చేయాలని అనుకున్నాడు. అయితే అందుకు తగ్గ ఆర్థిక స్థోమత లేదు. అయినా ఎలాగైనా వివాహం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో సుమారు రూ.6లక్షలు అప్పు చేశాడు. ఈ డబ్బులతో కళ్యాణ మంటపంలో ఏర్పాట్లను ఘనంగా చేశాడు. ధనవంతుల వివాహానికి ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని రకాల ఏర్పాట్లూ చేశాడు.

Viral Video: కుక్క పిల్లల మధ్య డబ్ల్యూ డబ్ల్యూ ఫైట్.. సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కోళ్లు.. చివరకు..


అయితే రాత్రికి భారీ వర్షం రావడంతో మంటపం పూర్తిగా (wedding hall turned muddy due to rain) బురదమయంగా మారింది. అలాగే భారీ ఈదురుగాలులకు మంటపంలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. తీరా వివాహం కూడా పూర్తి కాకుండానే మంటపం మొత్తం ఇలా తయారవడం చూసి పెళ్లికి వచ్చిన వారంతా అయ్యో పాపం అంటూ పెళ్లికూతురు తండ్రిపై సానుభూతి చూపించారు.

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పెళ్లిళ్ల కోసం అప్పు చేసి ఇన్ని ఏర్పాట్లు చేయడం అనవసరం’’.. అంటూ కొందరు, ‘‘దీని బదులుగా ఆ డబ్బులను కుమార్తె బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసి ఉంటే బాగుండు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Updated Date - Jul 17 , 2024 | 09:40 PM

Advertising
Advertising
<