Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Sep 14 , 2024 | 06:14 PM
హార్స్‌షూ క్రాబ్స్ అని పిలిచే ఓ రకం పీతల రక్తం అత్యంత విలువైనది. నీలి రంగులో ఉండే ఈ రక్తం లీటరు ధర ఏకంగా రూ.12 లక్షలు. విషతుల్యాలను గుర్తించే ఈ రక్తాన్ని వైద్య పరీక్షల్లో వినియోగిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి సుఖమయ జీవనానికి ప్రకృతిలో ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని సులువుగా లభిస్తే మరికొన్ని మాత్రం వాటికున్న డిమాండ్ రీత్యా కళ్లు చెదిరే ధర పలుకుతుంటాయి. మనం ప్రస్తుతం చెప్పుకోబోయే పీత రక్తం కూడా అలాంటిదే. ఈ రక్తం ధర లీటరుకు ఏకంగా రూ.12 లక్షలంటే ఆశ్చర్యం కలగకమానదు. మరి ఈ పీత ఏ జాతికి చెందినదో? దాని రక్తానికి అంత డిమాండ్ ఎందుకో తెలుసుకుందాం పదండి (viral)!
Viral: ఇండియాకొచ్చాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది.. అమెరికా మహిళ వీడియో వైరల్
హార్స్‌షూ క్రాబ్స్ అని పిలిచే ఈ పీతల రక్తం వైద్య పరంగా అత్యంత విలువైనది. సాధారణంగా రక్తం అంటే ఎర్రగా ఉంటుందని భావిస్తాం. దీనికి కారణం రక్తంలో ఉండే హిమోగ్లోబిన్. ఇందులో ఐరన్ ఉంటుంది. అయితే, పీతలో మాత్రం కాపర్ ఆధారిత హీమోసయానిన్ ఉంటుంది. ఫలితంగా ఈ పీత రక్తం నీలి రంగులో ఉంటుంది. లీటరు హార్స్‌షూ క్రాబ్ రక్తం ఏకంగా 15 వేల డాలర్లు. అంటే సుమారు రూ.12 లక్షలన్న మాట. అందుకే దీనికి నీలి బంగారం అన్న పేరు కూడా ఉంది (Horseshoe Crab Blood Most Expensive).
Viral: నేటి తరం చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా? వీడియో చూస్తే షాక్ పక్కా!
ఎందుకింత ఖరీదంటే..
వైద్య పరంగా ఈ రక్తం అత్యంత విలువైనది. దీన్ని కొన్ని రకాల డ్రగ్స్ ఉత్పత్తుల పరీక్షల్లో వాడతారు. ఈ రక్తంలో లిమ్యులస్ అబీమోసైట్ లైసేట్ అనే కాంపౌండ్ ఉంటుంది. మనుషుల్లో తీవ్ర అలర్జీలకు కారణమైయ్యే ఎండోటాక్సిన్స్ అనే ప్రాణాంతక విషతుల్యాలను ఈ రక్తంతో సులువుగా గుర్తించొచ్చు. అందుకే ఈ రక్తం చాలా ఖరీదైనది.
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?
ఈ పీతలు సాధారణంగా అమెరికా తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. వైద్య రంగం అవసరాలకు సరిపడా వీటి నుంచి వాటి రక్తాన్ని వెలికితీసేందుకు ఏటా ఆరు లక్షల పీతలను పట్టాల్సి వస్తుంది. ఒక్కో పీతలోని 30 శాతం రక్తాన్ని వెలికితీస్తారు. ఈ ప్రక్రియను తట్టుకోలేక సుమారు 30 శాతం పీతలు కన్నుమూస్తాయి. ప్రక్రియ పూర్తయ్యాక పీతలను మళ్లీ సముద్రంలో విడిచిపెట్టేసినా వాటిలో ఎన్ని బతుకుతాయనే దానిపై శాస్త్రవేత్తల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. దీంతో, వీటి జనాభా నానాటికీ తగ్గిపోతోంది. ఈ పరిస్థితిపై పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Viral: డైవర్స్ తీసుకున్న మహిళ రెండో పెళ్లికి పెట్టిన కండీషన్స్.. జనాలకు షాక్!