ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కంప్యూటర్ల మధ్యలోకి దూరిన పాము.. ఏమాత్రం భయపడని ఈమె.. చివరకి ఎలా పట్టుకుందో చూడండి..

ABN, Publish Date - Jul 28 , 2024 | 09:18 PM

జనావాసాల్లోకి పాములు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరే పాములు మంచాల కింద, ఫ్రిడ్జిలు, కూలర్లలో దాక్కుని ఉంటాయి. ఉన్నట్టుండి వాటిని చూసి జనాలు భయపడిపోతుంటారు. ఇలాంటి..

జనావాసాల్లోకి పాములు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు ఇళ్లల్లోకి దూరే పాములు మంచాల కింద, ఫ్రిడ్జిలు, కూలర్లలో దాక్కుని ఉంటాయి. ఉన్నట్టుండి వాటిని చూసి జనాలు భయపడిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు పాములు పట్టుకునే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పాము కంప్యూటర్ల మధ్యలోకి దూరింది. ఏమాత్రం భయపడని ఓ మహిళ చివరికి ఎలా పట్టుకుందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాము సడన్‌గా ఓ ఆఫీసు గదిలోకి దూరిపోతుంది. దీంతో సిబ్బంది మొత్తం భయంతో బయటికి పరుగులు పెట్టారు. లోపలికి దూరిన పాము చివరకు కంప్యూటర్ల మధ్యలోకి దూరిపోతుంది. దీంతో ఆఫీసు గదిలోకి రావడానికి అంతా భయపడుతుంటారు.

Viral Video: పిల్ల ఏనుగే కదా అని దాడి చేసిన సింహాలు.. కాసేపట్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాయి..


చివరకు విషయం తెలుసుకున్న ఓ మహిళ అక్కడికి వస్తుంది. ఏమాత్రం భయపడకుండా లోపలికి వెళ్లి పాము ఉన్న ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. చివరకు కంప్యూటర్ల మధ్యలో చేయి పెట్టి (woman catches snake in office) పామును బయటికి తీస్తుంది. చివరకు దాన్న ఓ సంచిలో వేసుకుని అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు తీసుకెళ్తుంది.

Viral Video: యువకుడి వేలు పట్టుకున్న ఉడుత.. ఏంటా అని ఆశ్చర్యపోయేలోపే.. చివరకు అది చేసిన నిర్వాకం..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘పాములు పట్టుకునే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లల డాన్స్‌కు ఫిదా అయిన పావురం.. చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Jul 28 , 2024 | 09:31 PM

Advertising
Advertising
<