ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: కంగనా రనౌత్‌‌‌కు చేదు అనుభవం.. విమానాశ్రయంలో షాకిచ్చిన మహిళా కానిస్టేబుల్..

ABN, Publish Date - Jun 06 , 2024 | 07:17 PM

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌‌‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మధ్యాహ్న సమయంలో..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌‌‌కు (Bollywood actress Kangana Ranaut) చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మధ్యాహ్న సమయంలో ఆమె చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే లోపల బోర్డింగ్ పాయింట్‌కు వెళ్లే సమయంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్.. కంగనా రనౌత్‌‌‌ను చెంపదెబ్బ కొట్టారు. దీంతో కంగనా ఉన్నట్టుండి షాక్‌కు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన సాగు చట్టాల్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా చేసిన వ్యాఖ్యాల కారణంగానే ప్రస్తుతం ఆమెపై కానిస్టేబుల్ ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై కంగనా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. విమానాశ్రయంలోని సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పారు. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తనకు వద్దకు వచ్చి (Woman constable slaps Kangana) అకారణంగా చెంపదెబ్బ కొట్టిందన్నారు.


దీనిపై కానిస్టేబుల్‌ను ప్రశ్నించగా.. తాను రైతులకు మద్దతుదారు అని చెప్పిందని కంగనా తెలిపారు. ఢిల్లీ చేరుకున్న కంగనా.. సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇతర సీనియర్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కుల్విందర్‌ను అదుపులోకి తీసుకుని సీఐఎస్ఎస్ కమాండెంట్ కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది. కాగా, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 06 , 2024 | 07:49 PM

Advertising
Advertising