ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో..! ఎర్ర చీమలతో చట్నీ.. చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ABN, Publish Date - Jul 05 , 2024 | 05:31 PM

కొందరు వింత వింత రెసిపీలతో సరికొత్త వంటలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు ఏవేవే ప్రాణులతో తమ పాక ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే వంటలు చూస్తే నోరూరితే.. మరికొందరు చేసే వంటలు చూస్తే...

కొందరు వింత వింత రెసిపీలతో సరికొత్త వంటలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొందరు ఏవేవే ప్రాణులతో తమ పాక ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే వంటలు చూస్తే నోరూరితే.. మరికొందరు చేసే వంటలు చూస్తే అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్ర వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎర్ర చీమలతో చేసిన చట్నీ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చట్నీని ఇలాక్కూడా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ చేసిన ఎర్ర చీమల చట్నీ (red ants chutney) చూసి అంతా అవాక్కవుతున్నారు. సదరు మహిళ ప్లాస్టిక్ బకెట్, కర్ర పట్టుకుని ఓ చెట్టు వద్దకు వెళ్లింది. చెట్టు సమీపానికి వెళ్లి కర్రతో చెట్టుపై గుంపులు గుంపులుగా ఉన్న ఎర్ర చీమలను తీసుకుని బకెట్‌లో వేసుకుంది. ఇలా చాలా ఎర్రచీమలను బకెట్‌లో వేసుకుని ఇంటికి తీసుకొస్తుంది.

Viral Video: వామ్మో..! వీడు మామూలోడు కాదురోయ్.. మొసలి దంతాలను ఎలా వాడుకున్నాడో చూస్తే..


ఈ క్రమంలో బతికున్న చీమలను కూడా నోట్లో వేసుకుని టేస్ట్ చూస్తుంది. తర్వాత చట్నీ చేసేందుకు సిద్ధమవుతుంది. ముందుగా వెల్లుల్లి, ఎండు మిరపకాయ, ఉల్లిపాయ తదితరాలను వేసి రాయితో రుబ్బుతుంది. అవి మెత్తగా అయిన తర్వాత ఎర్రచీమలను అందులో వేసి మళ్లీ రుబ్బుతుంది. ఇలా చివరకు ఎర్రచీమల చట్నీని సిద్ధం చేస్తుంది. ఈ చట్నీని పిల్లలకు, పక్కన ఉన్న అతిథులకు అందిస్తుంది. దాన్ని టేస్ట్ చేసిన వారంతా ఎంతో రుచిగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

Viral Video: జుట్టు ఆరబెట్టేందుకు ఈమె వాడిన టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


ఈ చట్నీ తినడం వల్ల జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుందని సదరు మహిళ చెబుతోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అమ్మ బాబోయ్.. ఎర్ర చీమలతో చట్నీనా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి చట్నీ మా జీవితంలో చూడలేదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 05 , 2024 | 05:31 PM

Advertising
Advertising