Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!
ABN , Publish Date - Sep 30 , 2024 | 01:16 PM
రేపు సెలువు రోజైనా ఆఫీసుకు రావాలంటూ బాస్ ఓ మహిళకు పెట్టిన మెసేజ్ నెట్టింట వైరల్ అవుతోంది. రాకపోతే జాబ్ పోతుందని బెదిరించడంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ ప్రపంచంలో కళ్లు చెదిరే జీతాలు ఉన్నట్టే భరింపరాని ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ ఒత్తిడి, రోజుకు 10 గంటలకు మించి పని చేయాల్సి రావడంతో అనేక మంది ఉద్యోగులు ఆనారోగ్యాల పాడవుతున్నాయి. ఈ విషతుల్యమైన పని సంస్కృతిపై ఇప్పటికే నెట్టింట గగ్గోలు రేగుతోంది. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ ఉద్యోగి పని ఒత్తిడి తట్టుకోలేక కన్నుమూయడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తాజాగా నెట్టింట పంచుకున్న ఉదంతంతో మారోసారి టాక్సిక్ వర్క్ కల్చర్‌పై చర్చకు మొదలైంది (Viral).
Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!
తనకు ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి బాస్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చిందీ చెబుతూ ఆ మహిళ ప్రముఖ చర్చావేదిక రెడిట్‌లో పంచుకున్న ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరుసటి రోజు సెలవు దినం కావడంతో తాను గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి 2.00 గంటలకు బాస్ మెసేజ్ పెట్టాడని ఆమె చెప్పింది. మరుసటి రోజు సెలవును రద్దు చేసి ఆఫీసుకు రావాలంటూ మెసేజ్ పెట్టాడని చెప్పింది. నీ జాబ్ కాపాడుకోవాలని ఉంటే సెలవు రోజు కూడా రావాల్సిందే అంటూ దారుణ వ్యాఖ్యలు చేశాడని వాపోయింది. దీంతో, తాను కూడా అదే రీతిలో జవాబు ఇచ్చానని, ఇంత రాత్రి మెసేజ్ ఏంటంటూ రిప్లై ఇచ్చానని ఆమె చెప్పింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా పంచుకుంది.
Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..
ఇది చదివిన నెటజిన్లు మహిళ బాస్‌పై మండిపడుతున్నారు. ఇలాంటి యాజమాన్యాల వల్లే ఉద్యోగుల సంస్థలను వీడతారని చెప్పారు. ఆ బాస్ తీరుతో ఎంతో మంది మానేసి ఉంటారని, కాబట్టి, స్టాఫ్ లేక సెలవులు రద్దు కూడా చేస్తున్నారని కొందరు అన్నారు. కొందరేమో మహిళ చర్యను తప్పు బట్టారు. అంతరాత్రి పూట మెసేజ్‌కు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దీనికి మహిళ జవాబిస్తూ బాస్ మెసేజ్ చదివాక తనకు మండుకొచ్చిందని, ఉండబట్టలేక అతడిని కడిగిపారేశానని చెప్పుకొచ్చింది.
Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక
ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కొందరు చెప్పారు. ఒక ఉద్యోగం పోతే పలు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి అదే సద్దుమణుగుతుందని చెబుతున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య
వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!