Viral: ``బాస్‌తో కొంత సమయం గడపాలి మరి``.. ఉద్యోగం కోసం అప్లై చేసిన పాకిస్తాన్ మహిళకు షాకింగ్ అనుభవం!
ABN , Publish Date - Jul 26 , 2024 | 11:58 AM
పాకిస్తాన్‌లో ఉద్యోగం కోసం అప్లై చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్‌లోని గిగా గ్రూప్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఆమె తనకు ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
పాకిస్తాన్ (Pakistan)లో ఉద్యోగం (Job) కోసం అప్లై చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఇస్లామాబాద్‌లోని గిగా గ్రూప్ (Giga Group)లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఆమె తనకు ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అదీనా హీరా అనే మహిళ ఇండీడ్ యాప్ (Indeed app) ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు ఉద్యోగం కోసం మహిళ దరఖాస్తు చేసుకుంది. అయితే హైరింగ్ మేనేజర్ ఆమెకు ఓ ``ప్రత్యేకమైన`` కండిషన్ పెట్టాడు. అతడితో జరిపిన ఛాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది (Viral News).
ఆ స్క్రీన్ షాట్‌ల ప్రకారం.. సదమ్ బుఖారీ అనే హైరింగ్ మేనేజర్.. మిస్ హీరాను ఇండీడ్‌లో సంప్రదించారు. ఉద్యోగం గురించి చెప్పారు. పని వివరాలు చెప్పడమే కాకుండా జీతం, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత బాస్ (Boss)కు సహకరించాలి అని కూడా చెప్పారు. ``సహకారం అంటే ఏమిటి?`` అని హీరా అడిగినపుడు, ``బాస్‌తో కొంత క్వాలిటీ టైమ్ గడపాలి`` అని బదులిచ్చాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన హీరా ఆ వ్యక్తిని తిట్టి.. బ్లాక్ చేసింది. ఆ స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
ఆ పోస్ట్ వైరల్ కావడంతో గిగా గ్రూప్ స్పందించింది. అది నకిలీ ప్రకటన అని, ఆ వ్యక్తితో తమ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టతనిచ్చింది. మరోవైపు ఆ మహిళకు నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ``ఇది చాలా విచారకరం, దురదృష్టకరం``, ``మీరు ఇలా ధైర్యంగా బయటకు చెప్పడం గొప్ప విషయం``, ``అతడిపై మహిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలి`` అంటూ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అదృష్టం అంటే ఇదే.. కూర్చున్న వ్యక్తి లేచి పక్కకు వెళ్లగానే ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..