ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎక్కడమే కాదు.. దిగడం కూడా తెలియాలి.. ఇతడేం చేశాడో చూడండి..

ABN, Publish Date - Oct 17 , 2024 | 11:34 AM

అత్యుత్సాహమో లేక అందరి ముందు ప్రత్యేకతను చూపించుకోవడానికో తెలీదు గానీ.. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనూ విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. అయితే..

అత్యుత్సాహమో లేక అందరి ముందు ప్రత్యేకతను చూపించుకోవడానికో తెలీదు గానీ.. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. మరికొందరు ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనూ విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసికొట్టడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు దిగే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai Local Train) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ లోకల్ రైలు స్టేషన్ నుంచి కదులుతుంటుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాను దిగాల్సిన స్టేషన్ వెళ్లిపోతోందని తెలుసుకున్న యువకుడు.. ఎలాగైనా దిగిపోవాలని తలుపు వద్దకు వచ్చాడు.

Viral Video: కుక్క దగ్గర కోతి చేష్టలు.. ఈ కాకి వేషాలు మామూలుగా లేవుగా..


అప్పటికే అక్కడ చాలా మంది నిలబడి ఉన్నారు. అయినా ఆ వ్యక్తి ఎలాగైనా దిగిపోవాలనే ఉద్దేశంతో ఇనుప రాడ్ పట్టుకుని కాసేపు తటపటాయించాడు. కాసేపటి తర్వాత ధైర్యం చేసి కింద అడుగు వేశాడు. అయితే ప్లాట్‌ఫామ్‌పై అడుగు వేయగానే ఒక్కసారిగా (man fell down from running train) అదుపు తప్పి ధబేల్‌మని కిందపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు రైలు మెల్లగా వెళ్తుండడంతో అతడికి ఏమీ కాలేదు. కిందపడ్డ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుని పైకి లేచాడు. ఆ సమయంలో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య పడి ఉంటే ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేది.

Viral Video: అందరి ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..


మొత్తానికి అతడికి ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనను రైల్లో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయత్నాలను ఎవరూ చేయొద్దు’’.. అంటూ కొందరు, ‘‘మామూలుగా దిగాలని తెలీక అలా దిగాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 64 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కదులుతున్న లారీలో ఇదేం పని.. ఇతడు చేసిన విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2024 | 11:34 AM