Viral Video: రైలు పట్టాల మధ్యలో ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం.. చివరకు ఏమైందో చూస్తే..
ABN, Publish Date - Dec 04 , 2024 | 09:26 AM
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏదో రకంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తుంటారు. కొందరైతే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో చాలా మంది ఏదో రకంగా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తుంటారు. కొందరైతే ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతో్ంది. ఓ యువకుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అంతలోనే ఓ రైలు సడన్‌గా దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాలపై ప్రమాదకర విన్యాసం (Dangerous stunts) చేసేందుకు సిద్ధమయ్యాడు. రైలు పట్టాల మధ్యలో నిలబడ్డ అతను.. ఆ వెంటనే వాటి మధ్యలో పడుకున్నాడు. కాసేపటికి ఓ రైలు వేగంగా అతడి మీదుగా వెళ్లిపోయింది. ఆ యువకుడు ఏమాత్రం భయపడకుండా కదలకుండా పడికుండిపోయాడు. రైలు పూర్తిగా దాటి వెళ్లిన తర్వాత పైకి లేచి నిలబడి తానేదే గొప్ప పని చేసినట్లుగా సంతోషంతో ఎగిరిగంతేశాడు.
Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..
రైలు కింద పడుకున్న సమయంలో (man lying in middle of the train tracks) ఏమాత్రం అటూ, ఇటూ అయినా చివరకు అతడి ప్రాణాలే పోయేవి. అయితే అదృష్టం బాగుండి అతడికి ఏమీ కాలేదు. ఇలా రైలు పట్టాలపై ప్రమాదకర విన్యాసాలు చేయడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు రైలు పట్టాల పక్కన నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం చూస్తున్నాం. అలాగే ఇటీవల ఓ యువకుడు కదులుతున్న గూడ్స్ రైలు నుంచి దూకబోయి, దాని చక్రాల కింద నలిగిపోయిన ఘటనను కూడా చూశాం.
Viral Video: ఏనుగుకు తిక్కరేగితే ఇలాగే ఉంటుంది మరీ.. మొసలిని ఏం చేసిందో చూస్తే..
ఇలాంటి ఘటనలు చూస్తున్నా కూడా చాలా మంది ఇలాగే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, రైలు పట్టాల మధ్య పడుకున్న యువకుడి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 44వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 04 , 2024 | 09:26 AM