ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: రైలు దిగే సమయంలో ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దు.. ఇతడు చేసిన పని చూడండి..

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:35 PM

రైలు ప్రయాణ సమయాల్లో తొందరపాటు కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా చాలా మంది చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. కొందరు..

రైలు ప్రయాణ సమయాల్లో తొందరపాటు కారణంగా చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా చాలా మంది చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. కొందరు యువకులైతే చిత్రవిచిత్ర విన్యసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు దిగే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. వేగంగా వెళ్తున్న రైల్లో ఓ యువకుడు చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు. దిగాల్సిన స్టేషన్‌ దాటిపోవడంతో ఓ యువకుడు కంగారుపడ్డాడు. ఎలాగైనా దిగిపోవాలనే తొందరలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి (running train) దిగే ప్రయత్నం చేశాడు. డోరు వద్ద నిల్చుని ఉన్నట్టుండి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. డోరు పక్కన ఉన్న ఇనుప రాడ్డు పట్టుకుని కాళ్లు నేలపై మోపాడు. అయితే అప్పటికే రైలు వేగంగా వెళ్తుండడంతో బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు.

Viral video: స్నానం ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఇతను తెలివి మామూలుగా లేదుగా..


చివరకు అదుపు తప్పి ధబేల్‌మని కిందపడిపోయాడు. ఈ క్రమంలో రైలు కింద పడబోయాడు. అయితే అదృష్టవశాతు పట్టాలకు దూరంగా పడ్డాడు. చివరకు పైకి లేచి కూర్చున్నాడు. ఈ ఘటనను చూస్తుంటే ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం..! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి తొందరపాటు పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: రైల్లో పవర్ బ్యాంక్ కొన్న వ్యక్తి.. అనుమానం వచ్చి తెరచి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Jun 20 , 2024 | 02:35 PM

Advertising
Advertising