ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రాణాలతో చెలగాటం అంటే ఇదే.. వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఎలా ఎక్కుతున్నారో చూడండి..

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:02 PM

తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు వ్యూస్, లైక్‌ల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది యువకులు ప్రమాకర స్టంట్స్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి..

తెలిసి కొందరు, తెలీక మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. మరికొందరు వ్యూస్, లైక్‌ల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది యువకులు ప్రమాకర స్టంట్స్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఇద్దరు యువకులు ఎక్కే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలు పట్టాల పక్కన నిలబడి ఉంటారు. మరో వ్యక్తి వారిని ఫోన్‌లో వీడియో తీస్తుంటాడు. ఇంతలో ఓ గూడ్స్ రైలు అటువైపు వస్తుంది. వేగంగా వెళ్తున్న ఆ రైలును చూసిన యువకులు దానికి మరింత సమీపానికి వెళ్తారు.

Viral Video: పెద్ద చేప పడిందని సంబరపడ్డాడు.. చేతిలోకి తీసుకోగానే.. ఉన్నట్టుండి షాకింగ్ సీన్..


చూస్తుండగానే వారిలో ఓ యువకుడు రైలు వెళ్తున్న దిశగా వేగంగా పరుగెత్తుతాడు. ఇలా పరుగెత్తుతూనే రైలు బోగీలను పట్టుకుని పైకి ఎక్కేస్తాడు. ఆ తర్వాత మరో యువకుడు కూడా అదే విధంగా వేగంగా (youth climbed onto running goods train) పరుగెత్తుతూ రైలు పైకి ఎక్కేస్తాడు. ఈ ఇద్దరు అలా విచిత్రంగా రైలు ఎక్కడం చూసి అంతా షాక్ అవుతున్నారు. వారి స్నేహితులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: స్కూటీపై లగేజీ తీసుకెళ్తున్న వ్యక్తిపై అనుమానం.. చివరకు సమీపానికి వెళ్లి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విన్యాసాలు చేయడం చాలా ప్రమాదకరం’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం ఇలా చేయడం సరికాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 33 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: భార్యాభర్తలు వంట గదిలో ఉండగా సడన్‌ షాక్.. కళ్లు మూసి తెరిచే లోపే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 04 , 2024 | 08:04 PM

Advertising
Advertising