ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: సింహంతో కలిసి చికెన్ షేరింగ్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN, Publish Date - Jun 02 , 2024 | 07:51 PM

క్రూరమృగాలు, విష సర్పాలతో ఆటలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందని చూస్తుంటాం. కొందరు బోనులో ఉన్న సింహాలను కెలికి చివరకు వాటి దాడికి గురవుతుంటారు. మరికొందరు బుసలు కొడుతున్న పాముల వద్ద పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అయితే...

క్రూరమృగాలు, విష సర్పాలతో ఆటలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందని చూస్తుంటాం. కొందరు బోనులో ఉన్న సింహాలను కెలికి చివరకు వాటి దాడికి గురవుతుంటారు. మరికొందరు బుసలు కొడుతున్న పాముల వద్ద పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ యువతి సింహంతో కలిసి చికెన్ షేర్ చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలో (Saudi Arabia) చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పడుకుని ఉన్న ఓ సింహం ముందు ప్లేటులో పెద్ద పెద్ద పచ్చి చికెన్ ముక్కలు ఉంటాయి. అలాగే అందులోనే చికెన్ రోస్ట్ కూడా ఉంటుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడ సింహంతో కలిసి యువతి కూడా కూర్చుని చికెన్ షేర్ చేసుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..


సింహం పక్కనే కూర్చున్న యువతి (young woman sitting next to lion) .. ప్లేటులో ఉన్న చికెన్ రోస్ట్‌ను తీసుకుని తింటుంది. సింహం కూడా తన మానాన తాను పచ్చి మాంసం ముక్కలను కొరుకుతూ ఉంటుంది. ఇలా సింహంతో కలిసి ఆ యువతి ఒకే ప్లేటులో చికెన్ చేసుకుందన్నమాట. అసలు విషయానికొస్తే.. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు తదితర జంతువులతో (trained Animals and birds) పాటూ పక్షులకూ ప్రత్యేక శిక్షణ ఇస్తారట.

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..


జూలలో సందర్శకులకు వింత అనుభూతిని ఇవ్వడం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తుంటారట, ఇక్కడ కనిపిస్తున్న సింహానికి కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతికి చాలా ధైర్యవంతురాలు’’.. అంటూ కొందరు, ‘‘సింహంతో చికెన్ షేరింగ్.. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...

Updated Date - Jun 02 , 2024 | 09:43 PM

Advertising
Advertising