Viral Video: ఎలుకతో వ్యాపారం.. ఇలాంటి గేమ్ ఎక్కడైనా ఉంటుందా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN, Publish Date - Dec 31 , 2024 | 06:22 PM
జంతువులతో వివిధ రకాల వ్యాపారాలు, వివిధ రకాల గేమ్‌లు ఆడేవారిని చూస్తుంటాం. కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులతో విచిత్ర విన్యాసాలు చేయిస్తూ డబ్బులు సంపాదించేవారిని తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
జంతువులతో వివిధ రకాల వ్యాపారాలు, వివిధ రకాల గేమ్‌లు ఆడేవారిని చూస్తుంటాం. కుక్కలు, కోతులు, ఏనుగులు తదితర జంతువులతో విచిత్ర విన్యాసాలు చేయిస్తూ డబ్బులు సంపాదించేవారిని తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఎలుకతో చేసిన విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు ఎలుకతో వింత గేమ్ ఆడించి, తద్వారా పందేలు కట్టడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఎలుకతో ఇలాంటి వ్యాపారం ఎక్కడైనా ఉంటుందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎలుకతో వింత గేమ్ (game with Rat) ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వారు ముందుగా నేలపై గొయ్యి తవ్వి, దానికి నాలుగు వైపులా నాలుగు రంధ్రాలు చేశారు. ఆ రంధ్రాలపై A, B, C, D.. ఇలా రాసి ఉంటారు. ఆ తర్వాత ఎలుక కాళ్లకు దారం కట్టి అసలు గేమ్ స్టార్ట్ చేశారు. ఆ ఎలుకను గొయ్యిలో వదిలేసిన తర్వాత.. ఏ రంధ్రంలోకి వెళితే.. దానిపై డబ్బులు వేసిన వారు విన్ అవుతారనేది ఈ గేమ్ సిద్ధాంతం.
Viral Video: గోడ మధ్యలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని పగులగొట్టి చూడగా చివరకు షాకింగ్ సీన్..
అందుకు తగ్గట్టుగా దారం సాయంతో ఎలుకను గాల్లో వేలాడదీయగా.. చుట్టూ ఉన్న వారు ఎవరికి తోచిన దానిపై వారు A, B, C, D లపై డబ్బులు వేశారు. తర్వాత ఎలుకను గొయ్యిలో వదిలేయగా.. అది నేరుగా B అని రాసి ఉన్న రంధ్రంలోకి దూరిపోతుంది. దీంతో దానిపై డబ్బులు వేసిన వ్యక్తి గెలుస్తాడన్నమాట. ఇలా ఎలుకతో విచిత్రమైన గేమ్ ఆడుతున్న వీరిని చూసి అంతా అవాక్కవుతున్నారు.
Viral Video: గడ్డ కట్టే చలిలో ఇదేం పని.. ఈ యువతి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలుకతో ఇలాంటి గేమ్ ఆడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఒడ్డున పడ్డ మొసలిని చుట్టు ముట్టిన కుక్కలు.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 31 , 2024 | 06:22 PM