Share News

Youtube: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి

ABN , Publish Date - Dec 04 , 2024 | 06:02 PM

ఇది సోషల్ మీడియా యుగం. అంతా యూట్యూబ్‌ ఛానెల్‌నే ఫాలో అవుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు సబ్ స్క్రైబర్స్ వెల్లువెత్తుతున్నారు. ఫాలోవర్స్ సైతం అదే విధంగా ఉంటున్నారు. మరి కొన్ని యూట్యూబ్ చానెల్స్‌కు అటు సబ్ స్క్రైబర్స్ ఉండడం లేదు.. ఇటు ఫాలోవర్స్ సైతం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఫాలోవర్స్‌తోపాటు సబ్ స్క్రైబర్స్ పెంచుకోవాలంటే..

Youtube: యూట్యూబ్‌లో మీకు సబ్ స్క్రైబర్లు పెరగడం లేదా? జస్ట్ ఇలా చేయండి

ప్రస్తుతం.. దాదాపు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యారు.. అవుతున్నారు. సోషల్ మీడియలో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ ఉన్నాయి. కానీ చాలా మంది యూట్యూబ్‌కే కనెక్ట్ అవుతున్నారన్న సంగతి అందరికి తెలిసిందే. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. తొలుత యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు.

Also Read: జాక్ పాట్ కొట్టిన రేవంత్ ప్రభుత్వం


ఉదాహరణకు... మార్కెట్‌లో కొత్త సెల్ ఫోన్ వచ్చింది. దాని ఫీచర్స్ గురించి తెలుసుకోవాలన్నా.. ఫ్యాన్ బిగించాలన్నా.. వంట ఎలా చేయ్యాలో తెలుసుకోవాలన్నా.. అంతా యూట్యూబ్‌నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా అంశాల కోసం యూట్యూబ్‌లో శోధిస్తు్న్నారు.

Also Read: ఆ విషయం.. మా హోం మినిస్టర్ భువనేశ్వరి చూసుకుంటారు


మరోవైపు ప్రతి ఒక్కరు యూట్యూబ్‌ చానెల్ సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా సొంతంగా లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు ఇలా యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి.. అలా అలా సబ్ స్క్రైబర్స్‌ను పెంచుకుంటున్నారు. అదే విధంగా లక్షల్లో నగదు సంపాదిస్తున్నారు.

Also Read: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు చెప్పిన శ్రీహర్షిత


మరికొందరు యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసినా.. అటు సబ్ స్క్రైబర్స్ పెంచుకోలేక పోతున్నారు. ఇటు నగదు సైతం సంపాదించలేక పోతున్నారు. దీంతో ఏం చేసేదిరా దేవుడా అన్నట్లుగా ఉంది వారి పరిస్థితి. అలాంటి వేళ.. ఈ పద్దతులను తు.చ. అనుసరిస్తూ వెళ్తే యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు సోదాహరణగా చెబుతున్నారు.


ఈ మార్గాల్లో ఫాలోవర్లను భారీగా పెంచుకోవచ్చు:

ఈ మార్గంలో వెళ్ల వద్దు.. ఓ వేళ వెళ్లారా..

యూట్యూబ్‌లో అనుచరులను పెంచుకోవాలనుకుంటే.. అక్రమ పద్దతు పాటించకండి. అంటే వివిధ యాప్‌లు, వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిని ఏ మాత్రం అనుసరించకండి. ఓ వేళ.. మీరు అలా ముందుకు వెళ్తే మాత్రం యూట్యూబ్ సంస్థ ఆ విషయాన్ని గుర్తించి.. మీ ఛానెల్‌ను మూసివేసే అవకాశముంది. కాబట్టి అలాంటి తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు.


కరెక్ట్ కంటెంట్ ఎంచుకోండి..

మీ యూట్యూబ్ ఛానెల్‌కు సబ్ స్క్రైబర్స్ భారీగా పెంచుకోవాలంటే... మీరు.. మీ ఫీల్డ్‌కు సంబంధించిన సరైన కంటెంట్‌ను ఎంచుకోండి. ఆ క్రమంలో ట్రేండింగ్‌‌లో ఉన్న అంశాలను తీసుకోండి. వాటిపై వీడియోను రూపొందించండి. దానిని యూట్యూబ్‌లో వదలండి. ఆ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే.. మీకు బాగే ఫాలోవర్స్ వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటుంది.


వీడియోకు లైఫ్ ఉండేలా చూసుకోండి.. అంటే..

కరెంట్ టాపిక్‌ను ఎంచుకోవడం.. దానిపై వీడియోను చేయడం ద్వారా సబ్ స్క్రైబర్స్‌ను భారీగా పెంచుకోవచ్చు. ఆ క్రమంలో ప్రత్యక్ష ప్రసారంపై సైతం ప్రత్యేక శ్రద్ధ కనబర్చాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఈ అంశంపై లేదా ఏదైనా అంశంపై.. మీ వీడియో గురించి ప్రతి ఒక్కరు ఆసక్తిగా చర్చించుకునే అవకాశముంది. ఇలా చేయడం వల్ల కూడా సబ్ స్క్రైబర్స్‌తోపాటు పాలోవర్స్‌ను కూడా పెంచుకోవచ్చు. ‌


ఇతర ప్లాట్ ఫారమ్‌ల నుంచి సహాయం తీసుకోవచ్చు..

మీ యూట్యూబ్ ఛానెల్‌లో భారీగా ఫాలోవర్స్, సబ్ స్క్రైబర్స్ పెంచుకోవాలంటే.. YouTube కాకుండా, మీరు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సహాయం తీసుకోవచ్చు. మీరు మీ వీడియో లింక్‌ను అక్కడ షేర్ చేయవచ్చు, తద్వారా మీ ఖాతాకు కనెక్ట్ చేయబడిన వ్యక్తులు సైతం YouTubeకి వస్తారు.. తద్వారా ఫాలోవర్స్, సబ్ స్క్రైబర్స్ పెరిగే అవకాశముంటుంది.

For Pratyekam News And Telugu News

Updated Date - Dec 04 , 2024 | 06:07 PM