మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..

ABN, Publish Date - Mar 30 , 2024 | 03:31 PM

ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న సమయంలో యూపీఎస్సీ వీడియోలు చూస్తున్న జొమాటో డెలివరీ ఏజెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral: ట్రాఫిక్ జాంలో ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ చేస్తోందేంటో రికార్డు చేసి నెట్టింట పెడితే..

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఏళ్లు కష్టపడినా ఒక్క ప్రభుత్వోద్యోగం కూడా రాదు. చూస్తుండగానే ఏజ్ పెరిగిపోయి చివరకు పరీక్షకు అర్హతనే కోల్పోతారు. మరికొందరేమో ఒకేసారి రెండు మూడు గవర్న్‌మెంట్ జాబ్స్‌కు ఎంపిక అవుతారు. వీళ్ల మధ్య ఏంటి తేడా అని ప్రశ్నిస్తే నెటిజన్లు ప్రస్తుతం ఓ వీడియో (Viral Video) చూపిస్తున్నారు. ఇలాంటి వాళ్లే ప్రభుత్వోద్యోగాలకు ఎంపికయ్యేది అని చెబుతున్నారు. వీడియోలో ఓ వ్యక్తి సివిల్స్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న తీరు జనాల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. మరికొందరు మాత్రం అతడి తీరుపై పెదవి విరుస్తున్నారు. ఇలాంటి పనులు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

StealToilet: బాయ్‌ఫ్రెండ్‌తో యువతి బ్రేకప్.. మరుసటి రోజు బాత్రూమ్‌లోకి వెళ్లి చూస్తే..


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ ట్రాఫిక్ జాంలో ఉండగా మొబైల్‌లో వీడియోలు చూస్తూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఓవైపు జీవితంలో ఎదగాలన్న ఆశ, మరోవైపు బరువు బాధ్యతలు, క్షణం కూడా తీరిక లేని ఉద్యోగాలు వెరసి ఆ డెలివరీ ఏజెంట్ చివరకు రోడ్డుపైనే ప్రిపరేషన్ కొనసాగించాల్సి వచ్చింది. అయితే, అతడు విసుక్కోకుండా, నిరాశకు లోనుకాకుండా తనకున్న ప్రతి క్షణాన్ని ఒడిసిపడుతూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాడు (Zomato Delivery Agent preparing for upsc in traffic jam).

థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..


ఇలాంటోళ్లే జీవితంలో ప్రభుత్వ జాబ్ కొట్టేదని కొందరు ప్రశంసిస్తున్నా మరికొందరు మాత్రం యువకుడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి ధోరణి ఓ రుగ్మత లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు డ్రైవింగ్ పైనే దృష్టి ఉండాలని, లేకపోతే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పనులు చేసి ఇతరులనూ ప్రమాదంలో పడేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇలా రకరకాల అభిప్రాయాల నడుమ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి మీరూ ఓసారి ఈ వీడియో చూడండి!

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 03:49 PM

Advertising
Advertising