Share News

Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:25 PM

చాలా మంది వర్క్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్‌ను మూసేయకుండా అటు ఇటూ తిరగడానికి వెళ్తుంటారు. ఇంట్లో అలా చేసినా ఫర్వాలేదు కానీ, ఆఫీస్‌లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ జొమాటో ఉద్యోగిణి అలాంటి తప్పిదమే చేసింది.

Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..
Prank tweet

చాలా మంది వర్క్ చేసిన తర్వాత ల్యాప్‌టాప్‌ (Laptop)ను మూసేయకుండా అటు ఇటూ తిరగడానికి వెళ్తుంటారు. ఇంట్లో అలా చేసినా ఫర్వాలేదు కానీ, ఆఫీస్‌లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఓ జొమాటో (Zomato) ఉద్యోగిణి (female employee) అలాంటి తప్పిదమే చేసింది. ల్యాప్‌టాప్ క్లోజ్ చేయకుండా పక్కకు వెళ్లింది. దీంతో ఆమె సహోద్యోగిణి ఓ ఫ్రాంక్ (Prank)చేసింది. ఆ ఫ్రాంక్ గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @niharigoat అనే జొమాటో ఉద్యోగిణి ఈ ట్వీట్ చేసింది (Viral News).


ఆఫీస్‌లో ఉన్నప్పుడు నిహారిక తన ల్యాప్‌టాప్‌ను క్లోజ్ చేయకుండా డెస్క్ నుంచి పక్కకు వెళ్లింది. అప్పుడు ఆమె సహోద్యోగిణి నిహారిక ల్యాప్‌టాప్ నుంచి ఓ మెసేజ్ చేసింది. ``హే గైస్, లైఫ్ అప్‌డేట్‌ను షేర్ చేసుకుంటున్నాను. నేను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నాను. సాయంత్రం ఐదు గంటలకు చిన్న పార్టీ ఉంది. ఆ సమయంలో నన్ను కాస్త ఫ్రీగా ఉండనివ్వండి`` అని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన నిహారిక.. ``ఎప్పుడూ మీ ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసి పక్కకు వెళ్లకండి`` అని ట్వీట్ చేసింది.


ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 1.5 లక్షల మందికి పైగా ఈ ట్వీట్‌ను వీక్షించారు. 2.6 వేల మందికి పైగా ఈ ట్వీట్‌ను లైక్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందించారు. ``నాకు గతంలో ఇలాంటి అనుభవం ఎదురైంది``, ``వెరీ ఫన్నీ``, ``ఆ ఎంప్లాయ్ క్రియేటివిటీ అదిరిపోయింది``, ``ఇలాంటి సరదా సహోద్యోగులు అందరికీ దొరకరు. ఎంజాయ్ చేయండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..


Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 04:27 PM