Share News

Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:51 PM

మనుషులు లేదా ఇతర ఏ జంతువులతో పోల్చుకున్నా కుక్కలకు ఉండే విశ్వాసం ఇంకెవరికీ ఉండదు. ఒక్కసారి అన్నం పెట్టి ఆదరిస్తే చాలు అవి ఎప్పటికీ విధేయంగా ఉంటాయి. యజమానికి కష్టం వస్తే విలవిలలాడతాయి. ఇక, పెంపుడు కుక్కలు అయితే కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోతాయి.

Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
Pet dog chasing the ambulance

మనుషులు లేదా ఇతర ఏ జంతువులతో పోల్చుకున్నా కుక్కలకు (Dogs) ఉండే విశ్వాసం ఇంకెవరికీ ఉండదు. ఒక్కసారి అన్నం పెట్టి ఆదరిస్తే చాలు అవి ఎప్పటికీ విధేయంగా ఉంటాయి. యజమానికి కష్టం వస్తే విలవిలలాడతాయి. ఇక, పెంపుడు కుక్కలు (Pet dog) అయితే కుటుంబ సభ్యుల్లాగానే కలిసిపోతాయి. యజమాని పట్ల ఎంతో ప్రేమతో ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెంపుడు కుక్కను చూస్తే కన్నీళ్లు రాకమానవు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@TaraBull808 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆంబులెన్స్ ఓ రోడ్డుపై వేగంగా వెళ్లిపోతోంది. ఆ ఆంబులెన్స్‌ను (Ambulance) ఓ కుక్క వెంబడిస్తోంది. ఆంబులెన్స్‌ను అందుకునేందుకు వేగంగా పరుగులు పెడుతోంది. ఎందుకంటే ఆ ఆంబులెన్స్‌లో ఆ కుక్క యజమాని ఉన్నాడు. అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్తోంటే కుక్క కూడా వెనుక పరుగులు పెడుతోంది. ఆ కుక్కను గమనించిన డ్రైవర్ ఆంబులెన్స్‌ను ఆపాడు. దిగి వెనక్కి వచ్చి ఆంబులెన్స్ డోర్ తీశాడు. కుక్క వెంటనే ఆంబులెన్స్ ఎక్కేసింది. ఈ ఘటన మొత్తాన్ని వెనుక బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.


ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 3.3 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``దైవ సృష్టిలో కుక్కలు చాలా గొప్పవి``, ``ఆ ఆంబులెన్స్ డ్రైవర్‌కు చాలా మానవత్వం ఉంది``, ``కుక్కలను మించిన ఆత్మీయులు ఉండరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..


Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి..


Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..


Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..


Picture Puzzle: మీ కళ్లకు స్పెషల్ టెస్ట్.. ఈ రెండు ఫొటోలోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 03:51 PM