IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ రద్దు కానుందా.. కారణమిదే..
ABN, Publish Date - Sep 24 , 2024 | 09:11 AM
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ వెదర్ గురించి షాకింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
టీమ్ ఇండియా(Test India), బంగ్లాదేశ్(Bangladesh) మధ్య ప్రస్తుతం రెండు టెస్టుల క్రికెట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య తదుపరి రెండో టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 27న కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరంగా ఈ సిరీస్‌లోని ఈ మ్యాచ్ భారత జట్టుకు చాలా కీలకమని చెప్పవచ్చు. కానీ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో టెస్టులో వర్షం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వెదర్ గురించి వచ్చిన కీలక అప్‌డేట్ ఏంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్ వాతావరణం ఎలా ఉంది
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టు తొలి రోజు వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ వెబ్‌సైట్ AccuWeather తెలిపింది. ఈ క్రమంలో మొదటి రోజు వర్షం పడే అవకాశం 92% ఉందని, ఇది టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటపై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. దీంతోపాటు రెండో రోజు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇలా మ్యాచ్ జరగబోయే ఐదు రోజుల వరకు వర్ష సూచనలను ప్రకటించింది.
ఈ వెబ్‌సైట్ ప్రకారం వర్షం పడే ఛాన్స్ ఎలా ఉందంటే
మ్యాచ్ మొదటి రోజు – సెప్టెంబర్ 27న - 92%
రెండో రోజు – సెప్టెంబర్ 28న - 49%
మూడో రోజు - సెప్టెంబర్ 29న - 65%
నాల్గో రోజు - సెప్టెంబర్ 30న - 56%
ఐదో రోజు - అక్టోబర్ 1న - 3%
రెండో టెస్టు మ్యాచ్‌కు ఇరు జట్లు
భారత జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్ ఉన్నారు
బంగ్లాదేశ్ జట్టులో నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహందీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ , సయ్యద్ ఖలీద్ అహ్మద్, జాకీర్ అలీ కలరు.
ఇవి కూడా చదవండి:
Anil Ambani: ఆనందంలో ఉన్న అనిల్ అంబానీకి మళ్లీ షాక్.. తన కుమారుడికి కోటి ఫైన్
Money Saving Tips: రోజు కేవలం రూ. 100 ఆదా చేయడంతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే
Stock Market: నాలుగున్నరేళ్లలో లక్షను రూ.29 లక్షలు చేసిన స్టాక్.. ఏకంగా 2818 శాతం గ్రోత్
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Read Latest Sports News and Telugu News
Updated Date - Sep 24 , 2024 | 09:13 AM