కోచ్‌కు విషమ పరీక్ష
ABN , Publish Date - Nov 04 , 2024 | 01:48 AM
కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో టీమిండియాకు ఊహించని ఓటములు ఎదురయ్యాయి. శ్రీలంక, న్యూజిలాండ్ చేతిలో పరాజయాలతో గంభీర్‌పై ఎంతో ఒత్తిడి నెలకొంది. గౌతీని బీసీసీఐ ఏరికోరి కోచ్‌గా నియమించుకొంది...
కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో టీమిండియాకు ఊహించని ఓటములు ఎదురయ్యాయి. శ్రీలంక, న్యూజిలాండ్ చేతిలో పరాజయాలతో గంభీర్‌పై ఎంతో ఒత్తిడి నెలకొంది. గౌతీని బీసీసీఐ ఏరికోరి కోచ్‌గా నియమించుకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు ఎంపికలో కూడా అతడు కలజేసుకొనే అవకాశం కల్పించింది. కానీ, తాజా పరిణామాలు గంభీర్ తీరును వేలెత్తి చూపే విధంగా ఉన్నాయి. ఏదైతే అది అనే విధంగా దూకుడుగా ఆడాలనే అతడి మంత్రం పనిచేయడం లేదనిపిస్తోంది. మూడో టెస్ట్‌లో సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపడం, తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ను 8వ నెంబర్‌లో పంపడానికి అంగీకరించడం లాంటివి వ్యూహాత్మక తప్పిదాలని మాజీలు విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్‌కు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ ఎంపికయ్యారంటే అంతా గంభీర్ వల్లేని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కానీ, వారి సామర్థ్యాలపై ఎన్నో అనుమానాలున్నాయని చెప్పాడు. మొత్తంగా చూస్తే రాబోయే ఆస్ట్రేలియా టూర్‌తో కొందరు సీనియర్లతోపాటు గంభీర్ భవిష్యత్ తేలిపోనుంది.