ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MS Dhoni-Joginder Sharma: మహేంద్రుడితో జోగేంద్రుడి ఫొటో, వైరల్

ABN, Publish Date - Aug 03 , 2024 | 11:18 AM

ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Joginder Sharma Meets MS Dhoni

ఢిల్లీ: ఇండియన్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni). క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టును లీడ్ చేస్తున్నారు. ధోనిని జోగిందర్ శర్మ కలిశారు. వీరిద్దరూ కలిసి 2007 టీ 20 వరల్డ్ కప్ సమయంలో ఆడారు. ఆ తర్వాత కలిసింది లేదు. పన్నెండేళ్ల తర్వాత ధోనిని మీట్ అయ్యారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది తెగ వైరల్ అవుతోంది.


హ్యాపీగా ఉంది..

‘చాలా రోజుల తర్వాత ధోనిని కలిశా. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలువడంతో ఈ రోజు చాలా డిఫరెంట్‌గా అనిపించింది అని’ జోగిందర్ శర్మ ఇన్ స్టాలో రాసుకొచ్చారు. 2007లో టీ 20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచింది. చివరి ఓవర్ బౌలింగ్ వేసి భారత జట్టును జోగిందర్ శర్మ విజయతీరాలకు చేర్చాడు. దాంతో రాత్రికి రాత్రే జోగిందర్ శర్మ హీరో అయిపోయాడు. జోగిందర్ శర్మ ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా పనిచేస్తున్నారు.


పాకిస్థాన్ టార్గెట్ 158 రన్స్..

2007 టీ 20 వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్ జొహన్నెస్ బర్గ్‌లో జరిగింది. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన పాకిస్థాన్ జట్టు కూడా దూకుడుగా ఆడింది. చివరి ఓవర్ వచ్చింది. పాకిస్థాన్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 13 పరుగులు కావాలి. క్రీజులో మిస్బా ఉల్ హక్, మహ్మద్ అసిఫ్ ఉన్నారు. వీరిద్దరిది చివరి వికెట్. అప్పటికే ఓ వికెట్ తీసి, దూకుడు మీద ఉన్న జోగిందర్ శర్మకు ధోని బౌలింగ్ ఇచ్చాడు. తనపై ధోని ఉంచిన నమ్మకాన్ని శర్మ వమ్ము చేయలేదు. భారత జట్టుకు అపూర్వ విజయాన్ని అందజేశాడు.


వైడ్‌తో ఓవర్ ప్రారంభం.. సిక్స్, ఔట్

చివరి ఓవర్‌ను జోగిందర్ వైడ్‌తో ప్రారంభించాడు. దాంతో స్టేడియంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. తొలి బంతి డాట్ బాల్ పడింది. రెండో బంతిని మిస్బా సిక్స్ కొట్టాడు. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. ఆ సమయంలో మిస్బా ఫైన్ లెగ్‌లో స్కూప్ షాట్ ఆడారు. అక్కడ ఉన్న ఫీల్డర్ శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఆ రోజును జోగిందర్ శర్మ జీవితంలో మరచిపోలేడు. అతనికి స్టార్ బౌలర్‌గా గుర్తింపు వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ధోనిని జోగిందర్ కలిశాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.


Read Sports News and
Latest Telugu News

Updated Date - Aug 03 , 2024 | 12:45 PM

Advertising
Advertising
<