ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

T20 World Cup 2024: నేడు అమెరికా vs ఇండియా మ్యాచ్..ఎవరు గెలుస్తారు, పిచ్ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Jun 12 , 2024 | 07:52 AM

ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024)లో నేడు టీమిండియా(team India), అమెరికా(America) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ 25వ మ్యాచ్‌ న్యూయార్క్‌(New York)లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది.

America vs team India 25th match

ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024)లో నేడు టీమిండియా(team India), అమెరికా(America) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ 25వ మ్యాచ్‌ న్యూయార్క్‌(New York)లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Nassau County International Cricket Stadium)లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు మొదలు కానుంది. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు కూడా రెండు విజయాలతో గ్రూప్ ఏలో పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లు కూడా ఎలాగైనా గెలవాలని బావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్ ఎలా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈరోజు మ్యాచ్ పిచ్ రిపోర్ట్(pitch report) గురించి చెప్పాలంటే ఈ పిచ్‌ గత రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన జట్టుకు ప్రయోజనం చేకూరింది. ఈ క్రమంలో ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచుకు కొంత మేఘాలు కమ్ముకున్నప్పటికీ వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మ్యాచ్‌ సమయంలో ఉష్ణోగ్రత 17 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని ప్రకటించారు. అయితే ఈ మ్యాచులో గూగుల్(google) గెలుపు అంచనా ప్రకారం చూస్తే అమెరికా జట్టుకు 9 శాతం గెలిచే అవకాశం ఉండగా, టీమిండియాకు 91 శాతం ఉందని పేర్కొన్నారు.


యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(united states of america) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో స్టీవెన్ టేలర్, మొనాంక్ పటేల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీస్ గూస్, ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్ ఉన్నారు.

టీమిండియా(team india) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కలరు.


ఇది కూడా చదవండి:

Terrorists Attack: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి..ఆర్మీ బేస్‌పై కాల్పులు, ఒకరు మృతి


Ratan Sharada : అతివిశ్వాసమే బీజేపీని ముంచింది!


Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 07:54 AM

Advertising
Advertising