Virat Kohli: టీ20లో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ స్పందన
ABN, Publish Date - Jun 16 , 2024 | 10:45 AM
ఇటివల జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో అద్భుత ఫామ్ కనబరిచిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో మాత్రం నిరాశ పరుస్తున్నారు. ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విరాట్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లీ(virat kohli) ఫామ్ గురించి టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Vikram Rathour) స్పందించారు.
ఇటివల జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో అద్భుత ఫామ్ కనబరిచిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో మాత్రం నిరాశ పరుస్తున్నారు. ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విరాట్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీ ఐర్లాండ్‌పై 1, పాకిస్తాన్‌పై 4, USAపై గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు. ఆ క్రమంలో విరాట్ రోహిత్ శర్మ(rohit sharma)తో ఇప్పటి వరకు పెద్దగా స్కోర్ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. ప్రస్తుతం గ్రూప్ దశ ప్రయాణం ముగియగా, భారత జట్టు ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి సూపర్ 8లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు చాలా ముఖ్యం. ఇప్పటికే అనేక మంది విరాట్ బ్యాటింగ్ గురించి విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోహ్లీ(virat kohli) ఫామ్ గురించి టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్(Vikram Rathour) స్పందించారు. ప్రతిసారీ కోహ్లీ బాగా రాణిస్తున్నాడా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను దానిని ఇష్టపడతానని, అస్సలు ఆందోళన లేదని అన్నారు. కోహ్లీ నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నారని, హంగ్రియర్ వెర్షన్ సూపర్ 8 దశలో సహాయపడుతుందని విక్రమ్ రాథోర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి విరాట్ కొంచెం ఆకలితో ఉండటం మంచిదని, బాగా ఆడటానికి ఆసక్తిని కలిగి ఉన్నాడని వెల్లడించారు.
ఫ్లోరిడా వేదికగా శనివారం భారత్, కెనడా(india vs canada) మధ్య జరగాల్సిన 2024 టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కుదరకపోవడంతో రెండు సార్లు ఫీల్డ్‌ని పరిశీలించిన అంపైర్ మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఎలాంటి మార్పు లేదు. ఇక జూన్ 20న సూపర్ 8లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ ఏలో భారత్(team india) ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మరోవైపు కెనడా ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములతో మూడు పాయింట్లతో పాకిస్తాన్ కంటే ముందంజలో ఉంది.
ఇది కూడా చదవండి:
Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే
Open Fire: పార్కులో కాల్పులు.. 10 మందికి గాయాలు!
Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు..ఈ రోజు ఏం చేస్తారు
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 16 , 2024 | 11:05 AM