ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ajit Agarkar: ఉన్న పళంగా ఆస్ట్రేలియాకు అగార్కర్.. ఆ నలుగురికి ఎర్త్ పెట్టేందుకే..

ABN, Publish Date - Nov 20 , 2024 | 07:49 PM

Ajit Agarkar: ఆస్ట్రేలియాతో తొలి సవాల్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి మొదలవనున్న మొదటి టెస్ట్‌లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంగారూ విజిట్ ఆసక్తిని రేపుతోంది.

IND vs AUS: ఆస్ట్రేలియాకు మరోమారు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది టీమిండియా. సొంతగడ్డపై టెస్టుల్లో కంగారూలను ఓడించడం అసాధ్యమని అంటుంటారు. కానీ దాన్ని దాటి ఆ జట్టుపై గత పర్యటనల్లో విజయాలు సాధించింది భారత్. ఏకంగా సిరీస్ కొల్లగొట్టింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఇంకోసారి సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. శుక్రవారం నుంచి మొదలయ్యే పెర్త్ టెస్ట్‌లో గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంగారూ విజిట్ ఆసక్తిని రేపుతోంది. ఆయన రాకతో బీసీసీఐ గట్టిగానే బిగిస్తోందని అంటున్నారు. ఆ నలుగురు క్రికెటర్లకు ఎర్త్ పెట్టేందుకే అగార్కర్‌ను అక్కడికి పంపారని చెబుతున్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


అసలు రీజన్ ఇదే..

ఆసీస్ పర్యటనకు వెళ్లిన అజిత్ అగార్కర్‌ను అక్కడే ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. సాధారణంగా టీమ్ సెలెక్షన్ తర్వాత ఏ టూర్‌కైనా కోచ్‌తో పాటు ప్లేయర్లు మాత్రమే వెళ్తారు. కానీ ఇప్పుడు అగార్కర్ ఆస్ట్రేలియాకు వెళ్లడం, ఐదు టెస్టుల సిరీస్ ముగిసేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఫ్యూచర్‌పై డిస్కషన్స్ కోసం అగార్కర్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండమని బోర్డు పెద్దలు చెప్పినట్లు సమాచారం.


ఫ్యూచర్‌పై క్లారిటీ

ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ అవడంతో సెలెక్షన్ కమిటీతో పాటు సీనియర్ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్‌ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అగార్కర్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా బోర్డు పెద్దలు ఆదేశించారట. ఆ సిరీస్‌లో సీనియర్ ప్లేయర్ల ఆటతీరు, ఫామ్, ఫిట్‌నెస్‌ను దగ్గర నుంచి గమనించాలని చెప్పారట. నాలుగో డబ్ల్యూటీసీ సీజన్ (2025-27)ను దృష్టిలో పెట్టుకొని కొత్త కుర్రాళ్లతో టీమ్‌ను బిల్డ్ చేయాలని చూస్తున్న బీసీసీఐ.. ఈలోపు రోహిత్‌తో పాటు మిగతా వెటరన్ల భవితవ్యంపై క్లారిటీకి రావాలని భావిస్తోందట. అందులో భాగంగానే బీజీటీతో ఏదో ఒకటి తేల్చేయాలని డిసైడ్ అయిందట. ఈ సిరీస్‌లో సీనియర్ల ఆటను గమనించి.. ఒకవేళ వాళ్లు గనుక ఫెయిలైతే ఫ్యూచర్ గురించి మాట్లాడి కీలక నిర్ణయం తీసుకోవాలని అగార్కర్‌కు సూచించిందట.


Also Read:

రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..

హార్దిక్ పాండ్యాకు ఘోర అవమానం.. పగబట్టి మరీ చేశారుగా

For More Sports And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 07:53 PM