Arjun Tendulkar: ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు పరువు తీసుకున్న అర్జున్ టెండూల్కర్
ABN, Publish Date - Nov 23 , 2024 | 09:58 PM
Arjun Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ మరోమారు తుస్సుమన్నాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు దారుణంగా ఫెయిలై పరువు తీసుకున్నాడు.
SMAT 2024: ఏ రంగమైనా వారసత్వంతో ఎంట్రీ ఇవ్వడం సులభమే. కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. సినిమాలు, రాజకీయాలతో పాటు క్రికెట్ లాంటి గేమ్స్‌లోనూ ఎంతో మంది వారసులు వచ్చారు. కానీ ఏ ఒకరిద్దరో తప్పితే ఎవరూ అంతగా సక్సెస్ కాలేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఎన్నో అంచనాలు ఉన్నా వాటిని అందుకోలేకపోయాడు. తాజాగా మరోమారు ఫెయిలై పరువు తీసుకున్నాడు. చెత్తాటతో విమర్శల పాలవుతున్నాడు.
చెత్త బౌలింగ్
రంజీ ట్రోఫీలో సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న అర్జున్ టెండూల్కర్.. ముస్తాక్ అలీ టోర్నీలో దాన్ని రిపీట్ చేయలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చుకొని నిరాశపర్చాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతడు పూర్తిగా తేలిపోయాడు. ముంబై సారథి శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 130 నాటౌట్) చేతుల్లో అతడు బలయ్యాడు. 4 ఓవర్లు వేసిన అర్జున్.. ఓవర్‌కు 12 పరుగుల చొప్పున మొత్తంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడమే గాక ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అన్‌సోల్డ్ లిస్ట్‌లోకి తప్పదా..
రంజీల్లో రాణించిన అర్జున్ ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో మంచి ధరకు అమ్ముడుపోతాడని అంతా అనుకున్నారు. అతడ్ని రిలీజ్ చేసిన ముంబైనే మళ్లీ దక్కించుకోవచ్చని భావించారు. కానీ ముస్తాక్ అలీ టోర్నీలో వికెట్ల వేటలో విఫలమవడం, భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో అర్జున్‌కు బిగ్ మైనస్ అనే చెప్పాలి. అయితే అతడి రంజీ పెర్ఫార్మెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఫ్రాంచైజీ ఆసక్తి చూపిస్తుందేమో చూడాలి. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలానికి అందుబాటులో ఉన్న సచిన్ కుమారుడు ఒకవేళ అమ్ముడవకపోతే అన్‌సోల్డ్ లిస్ట్‌లో చేరతాడు. ముస్తాక్ అలీ టోర్నీలో బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అతడికి ఎంత నష్టం కలిగిస్తుందో రెండ్రోజుల్లో తేలిపోనుంది.
Also Read:
పెర్త్ టెస్ట్‌లో ఊహించని సీన్.. ఈ సెల్యూట్‌కు అర్థం
ఊచకోతకు హార్దిక్ కొత్త డెఫినిషన్.. ఎవర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు
ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..
For More Sports And Telugu News
Updated Date - Nov 23 , 2024 | 10:00 PM