ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pat Cummins: కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలుసు: కమిన్స్

ABN, Publish Date - Dec 05 , 2024 | 07:16 PM

Pat Cummins: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి.

IND vs AUS: పెర్త్ టెస్ట్‌లో ఘోర ఓటమి పాలవడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోపంతో రగిలిపోతున్నాడు. తమను చిత్తు చేసిన టీమిండియా పని పట్టాలని భావిస్తున్నాడు. రెండో టెస్ట్‌లో రోహిత్ సేన మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. అయితే అతడికి వరుస షాకులు తగులుతున్నాయి. సీనియర్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ గాయం కారణంగా దూరమవడంతో కమిన్స్‌కు ఏం చేయాలో పాలుబోవడం లేదు. టీమిండియా మీద సూపర్ రికార్డ్ ఉన్న హేజల్‌వుడ్ లేని లోటు కంగారూలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ తరుణంలో ఆసీస్ టీమ్‌పై వేరే వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో సారథి కమిన్స్ సీరియస్ అయ్యాడు.


లుకలుకల్లేవ్

కావాలనే తమ జట్టును టార్గెట్ చేస్తున్నారంటూ కొందరు కామెంటేటర్లపై కమిన్స్ ఫైర్ అయ్యాడు. అంతా తెలుసునని.. హెడ్‌లైన్ల కోసమే హేజల్‌వుడ్ అంశాన్ని హైలైట్ చేస్తున్నారని అన్నాడు. తమ టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. ఇదంతా కావాలనే సృష్టించారని కొట్టిపారేశాడు. హేజల్‌వుడ్ కామెంట్స్‌ను కొందరు తప్పుగా మారుస్తున్నారని సీరియస్ అయ్యాడు కమిన్స్. దీనికి గ్రౌండ్‌లోనే కౌంటర్ ఇస్తామని.. ఎప్పటిలాగే అడిలైడ్ టెస్ట్‌కూ ప్రిపేర్ అవుతున్నామని ఆసీస్ సారథి స్పష్టం చేశాడు. తమ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి లుకలుకలు లేవన్నాడు.


దుమారం మొదలైందిలా..

హెడ్‌లైన్ల కోసం కొందరు ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంటారని.. వారికి మరికొందరు కామెంటేటర్లు మద్దతుగా నిలుస్తారంటూ కమిన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గెలుపు కోసం ఏం చేయాలో దాని మీదే ఫోకస్ చేస్తున్నామని తెలిపాడు. కాగా, పెర్త్ టెస్ట్‌ ఓటమిపై ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ హేజల్‌వుడ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ ఓటమికి కారణం ఏంటనేది బ్యాటర్లను అడగమంటూ అతడు చేసిన కామెంట్స్‌తో ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌ రెండుగా చీలిపోయిందని, టీమ్‌లో లుకలుకలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆసీస్‌లో భయం అలుముకుంది, హేజల్‌వుడ్‌ను టీమ్‌లో నుంచి తీసేయడమే దీనికి కారణమంటూ గవాస్కర్ లాంటి కొందరు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కమిన్స్ పైవ్యాఖ్యలు చేశాడు. తమను టార్గెట్ చేశారంటూ ఇన్‌డైరెక్ట్‌గా భారత మాజీలు, టీమిండియాపై సీరియస్ అయ్యాడు.


Also Read:

బ్రాండ్ వాల్యూలో ఆ ఐపీఎల్‌ టీమే టాప్.. సన్‌రైజర్స్ తగ్గేదేలే

ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ

భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 07:16 PM