ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Boxing Day Test: 74 ఏళ్ల సంప్రదాయం.. బాక్సింగ్ డే టెస్ట్‌‌ ఎందుకంత స్పెషల్ అంటే..

ABN, Publish Date - Dec 25 , 2024 | 05:36 PM

Boxing Day Test: క్రికెట్‌లో ఎన్నో ప్రఖ్యాత మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ సమరం దగ్గర నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ వైరి వరకు ఎన్నో టాప్ రైవల్రీ ఫైట్స్ ఉన్నాయి. అయితే అన్నింటి కంటే కూడా ఒక టెస్ట్‌ మాత్రం చాలా స్పెషల్‌గా చెబుతుంటారు. అదే బాక్సింగ్ డే టెస్ట్.

Boxing Day Test

IND vs AUS: క్రికెట్‌లో ఎన్నో ప్రఖ్యాత మ్యాచ్‌లు ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ సమరం దగ్గర నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ వైరి వరకు ఎన్నో టాప్ రైవల్రీ ఫైట్స్ ఉన్నాయి. అయితే అన్నింటి కంటే కూడా ఒక టెస్ట్‌ మాత్రం చాలా స్పెషల్‌గా చెబుతుంటారు. అదే బాక్సింగ్ డే టెస్ట్. ఇందులో ఒక్క టీమ్ మాత్రమే మారుతూ ఉంటుంది. బాక్సింగ్ డే ఫైట్‌లో ఆస్ట్రేలియా ఒక జట్టుగా బరిలోకి దిగితే.. మరో జట్టుగా భారత్, ఇంగ్లండ్ లాంటి ఇతర బిగ్ టీమ్స్ ఆడుతూ వస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, యాషెస్ సిరీస్‌లో మిగిలిన టెస్టుల కంటే బాక్సింగ్ డే టెస్ట్‌కే ఎక్కువ పబ్లిసిటీ, క్రేజ్, పాపులారిటీ నెలకొంటోంది. అసలు.. దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? ఈ టెస్ట్ హిస్టరీ ఏంటి? ఇది ఎందుకంత ఫేమస్? అనేది ఇప్పుడు చూద్దాం..


ఆసీస్ బోర్డు ప్లానింగ్

బాక్సింగ్ డే టెస్ట్ అనేది ఆసీస్‌కు సంప్రదాయంగా వస్తోంది. 74 ఏళ్లుగా ఈ మ్యాచ్‌ను నిర్వహించడం కంగారూలకు అలవాటుగా మారింది. 1950-51 సీజన్‌లో భాగంగా డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 27 తేదీల మధ్య ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ టెస్ట్ జరిగింది. అప్పుడు మొదలైన బాక్సింగ్ డే కల్చర్ ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది. మధ్యలో 1953 నుంచి 1967 వరకు బాక్సింగ్ డే టెస్టులు జరగలేదు. కానీ 1974-75 నుంచి మళ్లీ ఈ ట్రెండ్ ఊపందుకుంది. మెల్‌బోర్న్‌లో క్రిస్‌మస్ తర్వాత రోజు బాక్సింగ్ డే టెస్ట్ నిర్వహించడం అనేది అప్పటి నుంచి ఆనవాయితీగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌ను ఓ పండుగలా గ్రాండ్‌గా ప్లాన్ చేయడం హైలైట్ అనే చెప్పాలి. 2013-14 యాషెస్ సిరీస్‌తో బాక్సింగ్ డే టెస్ట్‌లకు క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ కోసం వేలాదిగా స్టేడియానికి తరలిరావడం మొదలైంది.


అలా మొదలైంది..

భారత్-ఆసీస్ మధ్య గురువారం నుంచి మొదలవనున్న బాక్సింగ్ డే టెస్ట్ టిక్కెట్లు ఎప్పుడో సేల్ అయిపోయాయి. టికెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయితే మిగతా మ్యాచులు, వెన్యూలు ఉన్నా.. ఎంసీజీకి, బాక్సింగ్ డే టెస్ట్‌కు మాత్రమే ఇంత హైప్ నెలకొనడానికి క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీనే కారణమని చెప్పొచ్చు. బాక్సింగ్ డే అనే పదం రిలీజియన్/కల్చరల్ ప్రాక్టీస్ నుంచి వచ్చినదిగా చెబుతారు. అప్పట్లో క్రిస్మస్ సమయంలో చర్చిల ముందు కొన్ని బాక్సులు పెట్టేవారు. పేదలకు సాయంలో భాగంగా కొందరు అందులో పాత బట్టలు, దుప్పట్లు, డబ్బులు, ఆహారం లాంటి నిత్యావసర వస్తువులు ప్యాక్ చేసి అందులో పెట్టేవారు. క్రిస్మస్ తర్వాతి రోజు అవసరమైన పేదలకు ఆ బాక్సుల్ని అందించేవారు. అలా బాక్సుల్లో ఇవ్వడం, క్రిస్మస్ తర్వాతి రోజు వాటిని అన్‌వీల్ చేసేవారు కాబట్టి బాక్సింగ్ డే అనే పదం వచ్చిందని చెబుతారు.


క్రీడల్లోనూ బాక్సింగ్ డే!

కాలక్రమేణా సంస్థల్లో ఉద్యోగులకు క్రిస్మస్ తర్వాతి రోజు గిఫ్ట్స్‌ను బాక్సుల్లో ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అలా బాక్సింగ్ డే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రమంగా ఈ రోజును చాలా ప్రభుత్వాలు పబ్లిక్ హాలీడేగా ప్రకటించాయి. దీంతో క్రిస్మస్ తర్వాతి రోజును వ్యాపార సంస్థలు తమ సేల్స్ కోసం ఉపయోగించుకోసాగాయి. అదే సమయంలో క్రీడల్లోనూ బాక్సింగ్ డేకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలైంది. బాక్సింగ్ డే ఈవెంట్స్, బాక్సింగ్ డే స్పోర్ట్స్ అనేవి నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ఆసీస్ క్రికెట్ బోర్డు 1980లో ఓ తీర్మానం చేసింది. ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో మెల్‌బోర్న్‌లో ఓ బాక్సింగ్ డే టెస్ట్ ఉండాలని తీర్మానించింది. అప్పటి నుంచి ఈ పరంపర కొనసాగుతోంది. కొన్నిసార్లు కంగారూ టీమ్ సౌతాఫ్రికాకు వెళ్లి బాక్సింగ్ డే టెస్ట్ ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువగా స్వదేశంలోనే ఈ తరహా మ్యాచులు ఆడటం గమనార్హం.


Also Read:

ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా హవా.. అశ్విన్ ఆల్ టైం రికార్డు సమం..

ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు

For More Sports And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 05:40 PM