ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్?.. ఆ స్టార్ ప్లేయర్ ఆడడంపై అనుమానం

ABN, Publish Date - Apr 03 , 2024 | 03:06 PM

ఇప్పటికే విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సీజన్‌లో సీఎస్కే తమ తర్వాతి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

హైదరాబాద్: ఇప్పటికే విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌కు(Chennai Super Kings) మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ సీజన్‌లో సీఎస్కే తమ తర్వాతి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో(Sunrisers Hyderabad ) ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు చెన్నైసూపర్ కింగ్స్ ప్రధాన పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్(Mustafizur Rahman) దూరమయ్యే అవకాశాలున్నాయి. 28 ఏళ్ల ముస్తాఫిజుర్ తన వీసా పనుల నిమిత్తం స్వదేశం బంగ్లాదేశ్ వెళ్లాడు. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. దీంతో అందుకు సంబంధించిన వీసా పనుల నిమిత్తం ముస్తాఫిజుర్ స్వదేశానికి వెళ్లాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ముస్తాఫిజుర్ వారం రోజులపాటు స్వదేశంలోనే ఉండనున్నాడు.

అదే జరిగితే చెన్నైసూపర్ కింగ్స్ ఆడే తర్వాతి మ్యాచ్‌కు ముస్తాఫిజుర్ దూరం కావడం ఖాయమనే చెప్పుకోవాలి. దీంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇది సీఎస్కేకు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో అదరగొట్టిన ముస్తాఫిజుర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న ముస్తాఫిజుర్ దగ్గరనే పర్పుల్ క్యాప్ కూడా ఉంది. తన స్లో ఆఫ్ కట్టర్ బంతులతో ఈ లెఫ్టార్మ్ పేసర్ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇక ముస్తాఫిజుర్ రహ్మాన్ అందుబాటులో లేకుంటే అతని స్థానంలో మరో లెఫ్టార్మ్ పేసర్ ముఖేష్ చౌదరిని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడింది. మూడింటిలో ఒకే మ్యాచ్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది.


చెన్నైసూపర్ కింగ్స్ పూర్తి జట్టు

రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మోయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్యా రహానే, సిమ్‌జెల్ రషీద్, సిమ్‌జెల్ రషీద్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అవనీష్ రావు అరవెల్లి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 03 , 2024 | 03:06 PM

Advertising
Advertising