ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ABN, Publish Date - Mar 26 , 2024 | 03:10 PM

ఈ ఏడాది చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. 1992 తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనున్నాయి. 1992 తర్వాత భారత్, ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే రెండు జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా ప్రకటించింది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒకటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఉండడం గమనార్హం. నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న ఈ సిరీస్ జనవరి 7 వరకు కొనసాగనుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి 26 మధ్య తొలి టెస్ట్ జరగనుంది. రెండో టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 మధ్య జరిగే ఈ మ్యాచ్‌ ఆడిలైడ్ వేదికగా జరగనుంది.


డిసెంబర్ 14 నుంచి 18 మధ్య బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. డిసెంబర్ 26 నుంచి 30 మధ్య మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు, జనవరి 3 నుంచి 7 మధ్య సిడ్నీ వేదికగా చివరిదైన ఐదో టెస్ట్ జరగనుంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా రెండు జట్ల మధ్య జరిగిన చివరి రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను టీమిండియానే గెలుచుకుంది. అలాగే చివరగా భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియానే సొంతం చేసుకుంది. అయితే భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 4, 8, 10న వన్డే సిరీస్.. 14, 16, 18న టీ20 సిరీస్ జరగనుంది. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగే సమయంలోనే భారత మహిళల జట్టు కూడా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఆసీస్ మహిళల జట్టు, భారత మహిళల జట్టు మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటించనుంది. డిసెంబర్ 5, 8న బ్రిస్బేన్ వేదికగా మొదటి రెండు వన్డేలు జరగనున్నాయి. 11న పెర్త్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఒకటి, మూడో వన్డే డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి.

IPL 2024: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్‌ల వివరాలివే!


IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్


Updated Date - Mar 26 , 2024 | 03:10 PM

Advertising
Advertising