CSK vs KKR: ధోనీని ఎవరూ అందుకోలేరు.. చెన్నైతో మ్యాచ్‌కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 08 , 2024 | 05:05 PM
గౌతం గంభీర్. ఈ పేరు గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ఆటతోనే కాకుండా వివాదాలతోనూ చాలా ఫేమస్ అయ్యాడు. ముక్కుసూటి తనంతో వ్యవహరించే గంభీర్ ఎలాంటి విషయం గురించి అయినా సరే నేరుగా మాట్లాడతాడు.
గౌతం గంభీర్(Gautam Gambhir). ఈ పేరు గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ఆటతోనే కాకుండా వివాదాలతోనూ చాలా ఫేమస్ అయ్యాడు. ముక్కుసూటి తనంతో వ్యవహరించే గంభీర్ ఎలాంటి విషయం గురించి అయినా సరే నేరుగా మాట్లాడతాడు. ఒకరిని ప్రశంసించడానికైన, విమర్శించడానికైన గంభీర్ వెనుకాడడు. ఆటతోపాటు ముక్కుసూటి తనంతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. టీమిండియా రెండు ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన గంభీర్.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు ట్రోఫీలు అందించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో లక్నోసూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్.. తాజా సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోల్‌కతా అదరగొట్టింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది.
సోమవారం చెన్నైసూపర్ కింగ్స్ జట్టుతో కోల్‌కతా (Chennai Super Kings vs Kolkata Knight Riders) తలపడనుంది. గతంలో గంభీర్, ధోని (MS Dhoni) ఐపీఎల్‌లో తమ జట్ల తరఫున కెప్టెన్లుగా పోటీ పడ్డారు. ప్రస్తుతం గంభీర్ మెంటార్‌గా, ధోని ఆటగాడిగా తలపడుతున్నారు. అయితే చెన్నైతో మ్యాచ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడాడు. ఈ క్రమంలో ధోనిపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు. గతంలో పలుమార్లు ధోనీని గంభీర్ విమర్శించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ధోని గొప్ప కెప్టెన్ అని, అతని స్థాయికి ఎవరూ చేరుకోలేరని గంభీర్ వ్యాఖ్యానించాడు. అలాగే ధోని ప్రాతినిధ్యం వహిస్తోన్న చెన్నైసూపర్ కింగ్స్‌తో తలపడడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే అని చెప్పుకొచ్చాడు.
‘‘నేను గెలవాలనుకుంటున్నాను. ఈ విషయంపై నా మనస్సులో చాలా స్పష్టంగా ఉన్నాను. స్నేహితులైన సరే పరస్పరం గౌరవించుకోవాలి. నేను కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోని చెన్నై కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రత్యర్థులుగా మైదానంలోకి దిగినప్పుడు ఇద్దరం గెలుపు కోసమే కష్టపడతాం. ఇదే ప్రశ్నను ధోనిని అడిగినా ఇలానే సమాధానం ఇస్తాడు. ప్రతి ఒక్కరు తాము గెలవాలనుకోవడం సహజమే. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక భారత కెప్టెన్. మిగతా వారెవరూ ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఇతర కెప్టెన్లు విదేశాల్లో గెలుస్తారు. టెస్టు మ్యాచ్‌లు గెలుస్తారు. కానీ దాని కంటే పెద్దదైన మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవలేరు. ఐపీఎల్‌లో ప్రతి మూమెంట్‌ను నేను ఆనందించాను.
చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడినప్పుడు ఎంఎస్‌కు అద్భుతమైన వ్యూహాత్మక మనస్తత్వం ఉందని నాకు తెలుసు. అతను వ్యూహాల విషయంలో మంచి కెప్టెన్. స్పిన్నర్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. స్పిన్నర్లు బౌలింగ్‌లో ఫీల్డర్లను ఎలా సెట్ చేయాలో బాగా తెలుసు. ధోనీ ప్రత్యర్థిగా బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. ఒక్కో బ్యాటర్‌కు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో అతనికి తెలుసు. చివరి బంతి వరకు మ్యాచ్ చేజారనీయకుండా ఉండేందుకు పట్టు బిగిస్తాడు. 6 లేదా 7 వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. అతడు క్రీజులో ఉంటే మ్యాచ్ ముగిస్తాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరమైనా చెన్నై భయపడదు. ఎందుకంటే అక్కడ ధోని ఉంటాడు. ఆ జట్టుపై బౌలింగ్ చేయడం కఠిన సవాల్‌తో కూడినదని నాకు తెలుసు. చెన్నై లాంటి జట్టుపై విజయం సాధించేవరకు విశ్రమించకూడదు. ఎందుకంటే ఆ జట్టులో చివరి బంతితోనైనా ఫలితం మార్చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఉన్నారు.’’ అని గంభీర్ ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..
IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!
Updated Date - Apr 08 , 2024 | 05:05 PM