ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్ అక్కడే.. వెన్యూ ఫిక్స్

ABN, Publish Date - Dec 22 , 2024 | 02:54 PM

IND vs PAK: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మీద క్రికెట్ లవర్స్‌లో ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. యుద్ధాన్ని తలపించే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు అన్ని కంట్రీస్‌లోని అభిమానులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఆ క్షణం త్వరలో నిజం కానుంది.

IND vs PAK

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మీద క్రికెట్ లవర్స్‌లో ఉండే ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. యుద్ధాన్ని తలపించే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలతో పాటు అన్ని కంట్రీస్‌లోని అభిమానులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఇది నిజం కానుంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. అయితే దాయాదుల మధ్య ప్లాన్ చేసిన ఈ సంకుల సమరం ఎక్కడ జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. పాకిస్థాన్‌కు భారత జట్టును పంపబోమని బీసీసీఐ తెగేసి చెప్పడంతో టీమిండియా మ్యాచుల్ని ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. ఎట్టకేలకు దీనిపై అప్‌డేట్ వచ్చింది.


మ్యాచులన్నీ అక్కడే..

చాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఉత్కంఠ అలాగే నడుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్‌ ఓకే చెప్పినా.. తటస్థ వేదిక ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో భారత్ మ్యాచుల్ని ఎక్కడ నిర్వహిస్తారనేది క్లారిటీ రాలేదు. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో రోహిత్ సేన ఎక్కడ తలపడుతుందో తెలుసుకుందామని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై అప్‌డేట్ వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే అన్ని మ్యాచుల్ని దుబాయ్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించిందట. దుబాయ్‌ను తటస్థ వేదికగా దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం.


ఆ ఆప్షన్‌కు వెళ్తారా?

టీమిండియా ఆడే అన్ని మ్యాచులు దుబాయ్‌లోనే నిర్వహిస్తారని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఫిబ్రవరి 23న భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం పాక్ జట్టు దుబాయ్‌కు రావాల్సిందేనట. ఒకవేళ రోహిత్ సేన సెమీస్, ఆపై ఫైనల్స్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచుల కోసం ఇతర జట్లు కూడా దుబాయ్ రావాల్సిందేనని సమాచారం. అయితే న్యూట్రల్ వెన్యూగా దుబాయ్ ఫిక్సా? లేదా కొలంబో లాంటి ఇతర ఆప్షన్ల వైపు ఐసీసీ మొగ్గుతుందా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై స్వయంగా అత్యున్నత క్రికెట్ బోర్డు ప్రకటన చేస్తే గానీ ఏదీ చెప్పలేం. త్వరలో ఆ మేరకు ఐసీసీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Also Read:

అరెస్ట్ వారెంట్‌పై ఊతప్ప రియాక్షన్.. ఇలా అనేశాడేంటి..

హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు

అశ్విన్.. అదొక్కటి మర్చిపోకు.. స్టార్ స్పిన్నర్‌కు ప్రధాని సజెషన్

సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ

For More Sports And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 03:03 PM