ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL 2024: ముంబైకి కూడా సన్‌రైజర్స్ గతే పట్టనుందా..? రోహిత్‌ను చూస్తే కన్నీళ్లు ఆగడం లేదంటున్న ఫ్యాన్స్

ABN, Publish Date - Mar 25 , 2024 | 05:05 PM

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ శాపం తగలనుందా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పట్టిన గతే ముంబై ఇండియన్స్‌కు కూడా పట్టనుందా.. అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ శాపం తగలనుందా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పట్టిన గతే ముంబై ఇండియన్స్‌కు కూడా పట్టనుందా.. అంటే అవుననే అంటున్నారు అభిమానులు. దీనికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉదంతాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. అప్పుడు డేవిడ్ వార్నర్.. ఇప్పుడు రోహిత్ శర్మ.. పాపం వీళ్లిద్దరినీ చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని వాపోతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓ ట్రోఫీ అందించడంతోపాటు జట్టును బలంగా తయారు చేసిన డేవిడ్ వార్నర్‌ను 2021లో ఐపీఎల్ మధ్యలోనే అర్ధాంతరంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించారు. అంతటితో ఆగకుండా తుది జట్టులో కూడా స్థానం కల్పించలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకడిగా ఉన్న వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించి అతని చేత వాటర్ బాటిళ్లు మోయించి దారుణంగా అవమానించారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.


అలాగే మరుసటి ఏడాదికి వార్నర్‌ను జట్టు నుంచి పూర్తిగా తొలగించారు. వార్నర్‌ను జట్టు నుంచి తొలగించి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిందేమి లేదు. వార్నర్ లేని గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ ఫేలవ ప్రదర్శన కనబర్చింది. ప్లేఆఫ్స్ చేరడం సంగతే మర్చిపోయింది. పాయింట్ల పట్టికలో 2021లో చిట్ట చివరి స్థానంలో, 2022లో 8వ స్థానంలో, 2023లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ శాపం తగిలిందని అభిమానులు అంటున్నారు. అందుకే జట్టు ఫేలవ ప్రదర్శన కనబరుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మకు అన్యాయం చేసిన ముంబై ఇండియన్స్‌కు కూడా ఇలాంటి గతే పట్టబోతుందని పలువురు అభిమానులు అంటున్నారు. ముంబైకి కూడా రోహిత్ శాపం తగులుతుందని చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో సన్‌రైజర్స్ లాగే ముంబై కూడా ఫేలవ ప్రదర్శన చేయబోతుందని అంటున్నారు. కాగా ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అయిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా 5 కప్‌లు అందించాడనే విశ్వాసం కూడా లేకుండా హిట్‌మ్యాన్‌ను అవమానించారని అభిమానులు అంటున్నారు. దీనికి తోడు ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ పట్లు కెప్టెన్ హార్దిక్ ప్రవర్తించిన తీరు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని వాపోతున్నారు. పాపం రోహిత్ శర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!

IPL 2024: ఎగిరి గంతేసిన కావ్య.. కానీ నిమిషాల్లోనే మాడిపోయిన మొహం.. అసలు ఏం జరిగిందంటే..



Updated Date - Mar 25 , 2024 | 05:05 PM

Advertising
Advertising