IND vs AUS: ఇది పిచ్ కాదు.. పార్క్.. చావుదెబ్బకు ప్లాన్ చేసిన కంగారూలు
ABN, Publish Date - Dec 13 , 2024 | 12:11 PM
IND vs AUS: భారత్‌ను మరోమారు ఓడించాలని చూస్తోంది ఆస్ట్రేలియా. గత పర్యాయాలు బీజీటీ ట్రోఫీని మిసైన కంగారూలు.. ఈసారి మాత్రం వదిలేదే లేదని పంతంతో ఉన్నారు.
Gabba Test: టెస్టుల కోసం ప్రతి ఆతిథ్య దేశం ప్రత్యేకమైన పిచ్‌లు తయారు చేయించుకోవడం సాధారణంగా జరిగేదే. ఏ కంట్రీ అయినా తమ టీమ్ బలాబలాలు, అక్కడి వాతావరణ పరిస్థితులు, ఆయా మైదానాల్లో గెలుపోటముల రికార్డులను బట్టి ఎలాంటి వికెట్‌ను రూపొందించాలనేది ప్లాన్ చేసుకుంటాయి. భారత్, శ్రీలంక లాంటి ఉపఖండ దేశాల్లో టర్నింగ్ ట్రాక్స్.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి విదేశాల్లో పేస్ ఫ్రెండ్లీ వికెట్స్ డిజైన్ చేయిస్తుంటారు. అయితే ఒక్కోసారి గెలవాలనే తాపత్రయంలో వికెట్‌లో డోస్ పెంచి విమర్శల పాలవుతుంటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మ్యాచ్ కోసం ఆసీస్ తయారు చేయించిన పిచ్ అదే విధంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇది పిచ్ కాదు.. పార్క్ అంటూ దానిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ వేస్తున్నారు.
పేసర్లకు స్వర్గధామం
ఆసీస్‌లో మోస్ట్ డేంజరస్ వికెట్‌గా గబ్బాకు ఘనమైన చరిత్రే ఉంది. పేస్, బౌన్స్‌కు స్వర్గధామం లాంటి ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే కంగారూ ప్లేయర్లు కూడా వణుకుతారు. ఇక ఇతర జట్ల ఆటగాళ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎన్నో లోస్కోరింగ్ మ్యాచులకు ఈ గ్రౌండ్ అడ్డాగా మారింది. పేసర్లు పండుగ చేసుకునే ఈ వికెట్‌పై భారత్‌ను చావుదెబ్బ తీసేందుకు గట్టిగానే ప్లాన్ చేశారు కంగారూలు. గడ్డితో నిండిన గ్రీన్ వికెట్‌ను డిజైన్ చేశారు. సాధారణంగా పిచ్ కాస్త పచ్చరంగులో కనిపిస్తేనే పేసర్లు ఆగరు. అలాంటిది గడ్డితో ఫుల్ గ్రీన్ వికెట్ తయారు చేస్తే.. ఇంకెంతగా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అదే మ్యాజిక్ రిపీట్
గబ్బా గ్రౌండ్ పిచ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. భారత్‌ను ఆపేందుకు గట్టిగానే ప్లానింగ్ చేశారని అంటున్నారు. బ్యాటర్ అన్నవాడు ఇలాంటి పిచ్ మీద ఆడాలని అనుకుంటాడా? అని ప్రశ్నలు వేస్తున్నారు. బ్యాటింగ్-బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేయాల్సిందని అంటున్నారు. ఇలాంటి ఐడియాలతో టీమిండియాను దెబ్బతీయలేరని కామెంట్స్ చేస్తున్నారు. 2021 సిరీస్‌లో ఇదే గబ్బాలో ఆసీస్ పొగరును భారత్ అణిచిందని.. మళ్లీ అదే రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
Also Read:
గబ్బా ఫైట్‌కు అంతా రెడీ.. 2 కీలక మార్పులతో బరిలోకి టీమిండియా
ఆసీస్ టీమ్‌లోకి డేంజరస్ ప్లేయర్.. కమిన్స్ గట్టి ప్లానింగే
సెంచరీ కొట్టినా భారత్‌కు భయపడుతున్న హెడ్
For More Sports And Telugu News
Updated Date - Dec 13 , 2024 | 12:17 PM