ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gautam Gambhir: ఆసీస్ పొగరు అణిచేందుకు రాక్షసుడ్ని దింపుతున్న గంభీర్.. ఇక దబిడిదిబిడే

ABN, Publish Date - Nov 17 , 2024 | 11:31 AM

Gautam Gambhir: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఎలాగైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన స్ట్రాటజీలను సిద్ధం చేస్తున్నాడు.

BGT 2024: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఎలాగైనా సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఆటగాళ్లందరితోనూ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో టీమ్‌ టాప్ లెవల్‌లో ఉండేలా చూసుకుంటున్నాడు. బెస్ట్ ఎలెవన్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా కొమ్ములు వంచేందుకు ఓ రాక్షసుడ్ని దింపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాడు. కంగారూల పొగరు అణచాలంటే అతడే కరెక్ట్ అని అనుకుంటున్నాడు. అతడి రాకకు గౌతీ సర్వం సిద్ధం చేశాడని.. ఇక దబిడిదిబిడేనని అంటున్నారు. మరి.. ఆ రాక్షసుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..


ఒక్క స్పెల్‌తో టీమ్‌లోకి..

టీమిండియా ఏస్ పేసర్ మహ్మద్ షమి రీఎంట్రీకి అంతా రెడీ అయిందని తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం త్వరలో అతడు ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు సమాచారం. అతడి రాకకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఇక బయల్దేరడమే తరువాయి అని వినిపిస్తోంది. అదేంటి.. నిన్న మొన్నటి వరకు గాయంతో ఇబ్బంది పడుతున్నాడు, కమ్‌బ్యాక్‌కు మరింత టైమ్ పడుతుందని అన్నారు.. హఠాత్తుగా టీమ్‌లోకి ఎలా వస్తున్నాడని సందేహిస్తున్నారా? ఒక్క మ్యాచ్‌తో అంతా మారిపోయింది. మోకాలి గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు షమి. ఇటీవల కోలుకున్న వెటరన్ స్పీడ్‌స్టర్.. తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే భుజం నొప్పి ఇబ్బంది పెట్టడంతో అతడు మైదానంలోకి అడుగు పెట్టడం కొన్నాళ్లు వాయిదా పడింది. కానీ తక్కువ సమయంలో కోలుకున్న షమి.. రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 7 వికెట్లతో దుమ్మురేపాడు.


ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం

రంజీ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లో 7 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో మంచి కాంట్రిబ్యూషన్ అందించాడు. ఫీల్డింగ్‌లో కూడా అదరగొట్టాడు. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించి తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని ప్రూవ్ చేశాడు. దీంతో గంభీర్ అతడ్ని ఆసీస్‌ ఫ్లైట్ ఎక్కాలని ఆదేశించాడని తెలుస్తోంది. షమి ఫిట్‌నెస్ నిరూపించుకుంటే రెండో టెస్ట్‌లో అతడ్ని ఆడిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే పెర్త్ టెస్ట్‌లోనే ఈ బౌలింగ్ రాక్షసుడ్ని బరిలో దింపాలని గంభీర్ పట్టుబట్టాడట. సెలెక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దల్ని ఒప్పించి షమీని వెంటనే అక్కడికి పంపాలని కన్విన్స్ చేశాడట. దీంతో మరికొన్ని గంటల్లో ఆసీస్‌కు షమి పయనం కానున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. తొలి టెస్ట్‌ నుంచి కంగారూలను వణికించాలంటే షమి లాంటి సీనియర్ బౌలర్ టీమ్‌లో తప్పక ఉండాలని గౌతీ భావిస్తున్నాడట. పదునైన బౌన్సర్లు, ఇన్‌స్వింగర్లు, ఔట్‌స్వింగర్లు, రివర్స్ స్వింగ్‌తో బ్యాటర్లకు పోయించే ఈ బౌలింగ్ రాక్షసుడు కమ్‌బ్యాక్ ఇస్తే సిరీస్ తమదేనని డిసైడ్ అయ్యాడట. అందుకే ఉన్న పళంగా షమీని వచ్చేయాలని రిక్వెస్ట్ చేశాడట.


Also Read:

స్పెన్సర్‌ ‘పాంచ్‌’

తన్మయ్‌ చేజారిన శతకం

పాకిస్థాన్‌కు ఐసీసీ ఝలక్‌

For More Sports And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 11:37 AM