GT vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్.. తుది జట్లు ఇవే!
ABN, Publish Date - Apr 04 , 2024 | 07:11 PM
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్‌లో రెండు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. పంజాబ్ జట్టులో లివింగ్ స్టోన్ స్థానంలో సికిందర్ రాజా జట్టులోకి వచ్చాడు. ఇక గుజరాత్ జట్టులో గాయపడిన డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లో తలపడ్డాయి. అత్యధికంగా గుజరాత్ రెండింటిలో, పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచాయి.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2024: దిగ్గజ బ్యాటర్ల సరసన రస్సెల్.. ఆ ఘనత సాధించిన ఆటగాడిగా..
IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..
Updated Date - Apr 04 , 2024 | 07:14 PM