ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mumbai Indians: అదే ముంబై ఇండియన్స్ కొంపముంచింది

ABN, Publish Date - May 04 , 2024 | 03:15 PM

ఐపీఎల్‌లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నై‌కి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..

ఐపీఎల్‌లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నై‌కి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై.. ఈ సీజన్‌లో దారుణంగా తేలిపోయింది. ఘోర పరాజయాల్ని చవిచూసి, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (Kolkata Knight Riders) జరిగిన మ్యాచ్‌లో ఓటమి చూడటం వల్లే.. ముంబై ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చేతిలో ఓడిపోవడానికి గల కారణాల్ని వెల్లడించాడు.


వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు నో ప్లేస్.. అతడి రియాక్షన్ చూసి

‘‘మా జట్టు ప్రదర్శనపై వచ్చిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కేకేఆర్ చేతిలో ఓటమిపై మాట్లాడేందుకు ఏమీ లేదు. మా ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. టీ20ల్లో సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోతే.. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మాకొచ్చిన ఫలితం కూడా అలాంటిదే. మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లను కోల్పోతూ వచ్చాం. అయితే.. మా బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు. నిజానికి.. తొలి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ మరింత మెరుగైంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం సులువే. కానీ.. మేము దానిని సరిగ్గా అందిపుచ్చుకోలేకపోయాం. మిగతా మ్యాచుల్లోనూ మేం తీవ్రంగా పోరాడుతాం. చివరి వరకూ విజయం కోసం శ్రమిస్తాం. ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామనేది వాస్తవమే కానీ, తప్పకుండా మంచి రోజులొస్తాయి’’ అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

అమెరికా జట్టులో భారత ఆటగాళ్లు.. మనతోనే పోటీ

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 19.5 ఓవర్లలో 169 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వెంకటేశ్ అయ్యర్ (70) అర్ధశతకంతో రాణించడం, మనీష్ పాండే (42) తనవంతు సహకారం అందించడంతో.. కేకేఆర్ అంత స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. సూర్యకుమార్ యాదవ్ (56) మినహాయిస్తే మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో, ముంబై జట్టు 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 24 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమిపాలై, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన కేకేఆర్ బౌలర్ మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లతో మెరిశాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 04 , 2024 | 03:15 PM

Advertising
Advertising