IND vs ENG 5th Test: కొత్త ప్లేయర్ ఎంట్రీ.. రెండు మార్పులతో బరిలోకి టీమిండియా
ABN, Publish Date - Mar 07 , 2024 | 09:15 AM
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు.
ధర్మశాల: టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) టేల్స్ చెప్పాడు. టాస్ టేల్స్ పడడంతో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఆకాష్ దీప్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చాడు. రజత్ పటీదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు టాస్ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. పేస్ బౌలర్ మార్కు వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్‌తో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో తమ కెరీర్‌ల్లో 100 టెస్టుల మైలురాయిని చేరుకున్నారు. అలాగే ఈ మ్యాచ్‌తో టీమిండియా తరఫున యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేశాడు. వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ పడిక్కల్‌కు టెస్ట్ క్యాప్ ఇచ్చాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 314వ ఆటగాడిగా పడిక్కల్ నిలిచాడు. కాగా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే గెలుచుకున్న సంగతి తెలిసిందే. 3-1 తేడాతో సిరీస్‌ను రోహిత్ సేన కైవసం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. విశాఖ, రాజ్‌కోట్, రాంచీ వేదికగా జరిగిన టెస్టులను వరుసగా గెలిచి సిరీస్‌ను పట్టేసింది.
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 07 , 2024 | 09:19 AM