Team India: టీమిండియాకు కొత్త ఓపెనర్స్.. అంతా కాలం చేతుల్లోనే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 08:24 PM
Team India: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాలో నూతన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జట్టులో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. తాజాగా కొత్త ఓపెనర్స్ అంశం వెలుగులోకి వచ్చింది.
IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీమిండియాలో నూతన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కంగారూ గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి జట్టులో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. తాజాగా మరో అంశం వెలుగులోకి వచ్చింది. భారత టీమ్‌కు కొత్త ఓపెనర్స్ రాక ఖాయమని వినిపిస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనింగ్ స్లాట్ కోసం ముగ్గురు సాలిడ్ బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా కొత్త ఓపెనర్స్ అవసరం ఏంటనేగా మీ సందేహం. అసలు ఎవరా నయా ఓపెనర్స్? ఈ డిస్కషన్ ఎందుకు వైరల్ అవుతోంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
క్రేజీ అప్‌డేట్
టీమిండియా బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వారసులను ఓపెనర్స్‌గా పంపాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు.. నెక్స్ట్ జనరేషన్ టీమ్‌లో వాళ్ల బెర్త్‌లను ఫైనలైజ్ చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ రావడానికి కారణం.. హిట్‌మ్యాన్ కొడుకు పేరు వైరల్ అవడమే. రోహిత్-రితికా సజ్దే దంపతులకు ఇటీవల కుమారుడు పుట్టిన సంగతి తెలిసిందే. అయితే వారసుడు జన్మించి పలు వారాలు అవుతున్నా భారత సారథి మాత్రం అతడి వివరాలేవీ వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్న తరుణంలో ఇవాళ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.
ఫ్యూచర్ ఓపెనర్స్
కొడుకుకు అహాన్ శర్మ అనే పేరు పెట్టామని రోహిత్-రితికాలు వెల్లడించారు. దీంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. భారత నెక్స్ట్ జనరేషన్ టీమ్ తయారైందని అంటున్నారు. భవిష్యత్ జట్టులో కోహ్లీ కొడుకు అకాయ్‌తో కలసి రోహిత్ కుమారుడు అహాన్‌ను ఓపెనర్లుగా దింపాలని అంటున్నారు. వీళ్లే ఫ్యూచర్ ఓపెనర్స్ అని ప్రిడిక్షన్ చెబుతున్నారు. పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా వారసుడు అంగద్ బుమ్రా రూపంలో మరో లెజెండరీ బౌలర్ కూడా ఆ జట్టులో ఉంటాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు స్టార్ల వారసులకు తోడు మరింత మంది భారత మాజీ క్రికెటర్ల పిల్లల్ని కూడా కలిపితే తోపు టీమ్ తయారవుతుందని చెబుతున్నారు.
Also Read:
స్పెషల్ ట్రోఫీతో రోహిత్.. ఈ కప్ ఎందుకిచ్చారో తెలుసా..
ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్
టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్ అంటే రోహిత్‌లా ఉండాలి
ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు.. ఈ 5 సవాళ్లను దాటితేనే కింగ్ అనిపించుకునేది
For Sports And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 08:46 PM