Yashasvi Jaiswal: జైస్వాల్‌ను భయపెట్టిన బచ్చా బౌలర్.. బుల్లెట్ డెలివరీస్‌తో షేక్ చేశాడు
ABN, Publish Date - Dec 01 , 2024 | 05:36 PM
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే అటాకింగ్‌కు దిగుతుంటాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ రోప్‌కు తరలిస్తుంటాడు. స్టార్ బౌలర్లను కూడా దంచికొడుతుంటాడు. అలాంటోడ్ని ఓ బచ్చా బౌలర్ భయపెట్టాడు.
IND vs PM 11: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే అటాకింగ్‌కు దిగుతుంటాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీ రోప్‌కు తరలిస్తుంటాడు. స్టార్ బౌలర్లను కూడా దంచికొడుతుంటాడు. ఫార్మాట్ ఏదైనా అటాకింగ్ అప్రోచ్‌తోనే ముందుకెళ్తుంటాడు జైస్వాల్. భారీ షాట్లతో బౌలర్లను బెదరగొడతాడు. వాళ్ల కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసి బ్యాక్ సీట్‌లోకి నెడతాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్‌లోనూ ఇదే ఫార్ములా ఉపయోగించాడు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ వంటి భీకర బౌలర్లను కూడా బాదిపారేశాడు జైస్వాల్. బౌండరీలు, సిక్సులతో వాళ్లను ఓ ఆటాడుకున్నాడు. కానీ అలాంటి జైస్వాల్‌ను ఓ బచ్చా బౌలర్ భయపెట్టాడు.
బౌన్సర్లతో వణికించాడు
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జైస్వాల్‌ను ఓ యంగ్ బౌలర్ భయపెట్టాడు. జాక్ నిస్బెట్ అనే బౌలర్ బుల్లెట్ డెలివరీస్‌తో భారత ఓపెనర్‌ను వణికించాడు. వరుసగా బౌన్సర్లు విసురుతూ జైస్వాల్‌కు ఊపిరి ఆడకుండా చేశాడు. మిడిల్ వికెట్ ను టార్గెట్ చేసుకొని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు నిస్బెట్. దీంతో పరుగులు రాబట్టేందుకు జైస్వాల్ ఇబ్బంది పడ్డాడు. దీంతో లెగ్ వికెట్ టార్గెట్ చేసుకొని బౌన్సర్లు వేశాడు. వేగంతో దూసుకొచ్చిన బౌన్సర్లను ఎదుర్కోవడంలో జైస్వాల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
కింద పడబోయి..
ఒక బాల్‌ను ఫేస్ చేయబోయి దాదాపుగా కింద పడిపోయాడు జైస్వాల్. అయితే ఎలాగోలా నిభాయించుకొని నిలబడ్డాడు. అయినా జాక్ నిస్బెట్ భారత ఓపెనర్‌ను వదల్లేదు. మళ్లీ బౌన్సర్లతో అతడ్ని టార్గెట్ చేశాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 45 పరుగులు చేశాడు. చివరకు చార్లీ అండర్సన్ బౌలింగ్‌లో అతడు వెనుదిరిగాడు. అయితే అడిలైడ్ టెస్ట్‌లో ఈ వీక్‌నెస్ మీద ఆసీస్ దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. దీని నుంచి జైస్వాల్ ఎలా బయటపడతాడో చూడాలి. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ 43.2 ఓవర్లకు 240 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన టీమిండియా పూర్తి 46 ఓవర్లు ఆడింది. 5 వికెట్లకు 257 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మన టీమ్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది.
Also Read:
టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్ అంటే రోహిత్‌లా ఉండాలి
ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు.. ఈ 5 సవాళ్లను దాటితేనే కింగ్ అనిపించుకునేది
కొడుకుకు నామకరణం చేసిన రోహిత్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
For Sports And Telugu News
Updated Date - Dec 01 , 2024 | 05:40 PM