IND vs SA: టీమిండియా కొంపముంచిన డకౌట్లు.. ‘0‘ పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు డౌన్!
ABN, Publish Date - Jan 03 , 2024 | 07:54 PM
భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే సంచలనాల మీద సంచలనాలు నమోదయ్యాయి. బౌలింగ్ పిచ్‌పై రెండు జట్ల పేసర్లు పండుగ చేసుకోవడంతో బ్యాటర్లంతా పెవిలియన్‌కు పరుగులుపెట్టారు.
కేప్‌టౌన్: భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలోనే సంచలనాల మీద సంచలనాలు నమోదయ్యాయి. బౌలింగ్ పిచ్‌పై రెండు జట్ల పేసర్లు పండుగ చేసుకోవడంతో బ్యాటర్లంతా పెవిలియన్‌కు పరుగులుపెట్టారు. తొలి రోజు ఆటలోనే రెండు జట్లు మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌటయ్యాయి. టీమిండియా పేసర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఒకానొక దశలో 153/4తో స్ట్రాంగ్‌గా కనిపించింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. అప్పటికే క్రీజులో కుదురుకున్న కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా మిగతా 6 వికెట్లను భారత జట్టు మరొక పరుగు కూడా చేయకుండానే కోల్కోయింది. దీంతో 153 పరుగుల వద్దనే ఆలౌటైంది. 153 పరుగుల వద్ద ఒక్క పరుగు కూడా జోడించలేకపోయిన భారత బ్యాటర్లు ‘సున్నా’ పరుగుల వద్దనే 6 వికెట్లను చేజార్జుకున్నారు. అది కూడా 11 బంతుల్లోనే కావడం ఆశ్చర్యకరం. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు కావడంతో కొంపముంచింది.
ముఖ్యంగా టీమిండియా స్కోర్ 153/4తో ఉన్న సమయంలో 34వ ఓవర్‌లో సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పాడు. ఆ ఓవర్‌లో 8 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌తోపాటు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాను డకౌట్లు చేశాడు. మొత్తంగా ఆ ఒక్క ఓవర్‌లోనే 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే రబాడ కూడా చెలరేగాడు. 46 పరుగులతో క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీతోపాటు ప్రసిద్ధ్ కృష్ణను డకౌట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కూడా ఒక్క పరుగు కూడా చేయకుండానే రనౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 35.5 ఓవర్లలోనే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు కీలకమైన 98 పరుగుల అధిక్యం లభించింది. 46 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ 39, శుభ్‌మన్ గిల్ 36 పరుగులు చేశారు. ఏకంగా ఆరుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు. అంతకుముందు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(6/15) విశ్వరూపానికి తోడు ముఖేష్ కుమార్ 2, బుమ్రా 2 వికెట్లు తీయడంతో 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైంది.
Updated Date - Jan 03 , 2024 | 07:54 PM