IND vs PAK: టీమిండియాకు పాకిస్థాన్ షాక్.. కుర్రాళ్లను నమ్మితే కొంపముంచారు
ABN, Publish Date - Nov 30 , 2024 | 08:08 PM
IND vs PAK: టీమిండియాకు షాక్ తగిలింది. గెలిపిస్తారనుకున్న కుర్రాళ్లు తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో దాయాది చేతిలో అవమానం తప్పలేదు.
Under 19 Asia Cup: పాకిస్థాన్‌కు మరోసారి పరాభవం తప్పదని అనుకున్నారు. మేజర్ టోర్నీల్లో దాయాది మీద టీమిండియాకు ఉన్న ఘనమైన రికార్డు కంటిన్యూ అవుతుందని భావించారు. భారత్‌ను ఆపడం పాక్ వల్ల కాదని అంచనా వేశారు. మన కుర్రాళ్లు టీమిండియాను గెలిపిస్తారని అనుకున్నారు. కానీ అంతా తారుమారైంది. భారత్‌కు షాక్ ఇచ్చింది పాక్. దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి చేతుల్లో ఓడింది మెన్ ఇన్ బ్లూ.
బ్యాటర్ల ఫెయిల్యూర్
ఎన్నో ఆశలతో అండర్-19 ఆసియా కప్ బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. దాయాది పాకిస్థాన్ చేతుల్లో 44 పరుగుల తేడాతో ఓడిన యంగ్ ఇండియా.. టోర్నమెంట్‌ను పేలవంగా ప్రారంభించింది. పాక్ సంధించిన 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 237 పరుగులకు ఆలౌట్ అయింది మెన్ ఇన్ బ్లూ. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నిఖిల్ కుమార్ (77 బంతుల్లో 67) ఒంటరి పోరాటం వృథా అయింది. మిగతా బ్యాటర్లంతా ఫెయిల్ అవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో బ్యాటర్లు ఫెయిల్ అవడం టీమ్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. నిఖిల్‌కు అండగా మరో ఒకరిద్దరు బ్యాటర్లు గట్టిగా నిలబడి ఉంటే మ్యాచ్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. కానీ అది సాధ్యం కాలేదు.
మంచి ఆరంభం లభించినా..
ఆయుష్ మాత్రే (20), సిద్దార్థ్ (15), మహ్మద్ అమన్ (16), కిరణ్ చోర్మలే (20), హర్వాన్ష్ సింగ్ (26).. ఇలా టాప్ బ్యాటర్లంతా మంచి స్టార్ట్ అందుకున్నాక పెవిలియన్ చేరారు. క్విక్ స్టార్ట్స్‌ను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. ఇక, అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ (147 బంతుల్లో 159) భారీ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (94 బంతుల్లో 60) అతడికి మంచి సహకారం అందించాడు. టీమిండియా బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన భారత్.. తదుపరి పోరులో జపాన్‌తో డిసెంబర్ 2న తలపడనుంది.
Also Read:
ఒక్క నోటు హార్దిక్ జీవితాన్ని మార్చేసింది.. రూ.400 నుంచి వందల కోట్లకు..
డౌటే లేదు.. కోహ్లీనే కెప్టెన్.. అశ్విన్ ఇలా అనేశాడేంటి
దిగొచ్చిన పాకిస్థాన్.. బీసీసీఐ దగ్గర తోకజాడిస్తే ఇలాగే ఉంటుంది
For More Sports And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 08:17 PM