ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్

ABN, Publish Date - Nov 25 , 2024 | 06:38 PM

IND vs AUS: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు.

పెర్త్: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు. పెర్త్ టెస్ట్‌లో మొదట్లో ఆధిపత్యం చూపించిన కంగారూలు.. ఆ తర్వాత బుమ్రా సేన పోరాటం ముందు నిలబడలేకపోయారు. అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ ఫుల్ అగ్రెషన్ చూపించిన భారత్.. ఆతిథ్య జట్టును 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మెన్ ఇన్ బ్లూ తిరిగి టాప్‌లోకి దూసుకెళ్లింది. అంతేకాదు.. ఒక్క గెలుపుతో ఏకంగా 5 అరుదైన రికార్డులను బద్దలుకొట్టింది. ఆ రికార్డులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


5,821 రోజుల తర్వాత..

పెర్త్ టెస్ట్ విక్టరీతో ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఇదే ఓప్టస్ స్టేడియంలో 2018లో కంగారూల చేతుల్లో భారత్ ఓటమిపాలైంది. అయితే తాజా విక్టరీతో రివేంజ్ తీర్చుకుంది. అంతేగాక పెర్త్‌లో తమను ఎవరూ ఓడించలేరనే ఆ టీమ్ అహంకారాన్ని అణచింది. 5,821 రోజుల తర్వాత ఈ గ్రౌండ్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది బుమ్రా సేన. అలాగే పలు రికార్డులు కూడా క్రియేట్ చేసింది. అందులో మొదటిది ఆప్టస్ స్టేడియంలో కంగారూలను ఓడించిన ఫస్ట్ టీమ్‌గా నిలవడం. ఇప్పటివరకు ఆ టీమ్‌ను ఈ గ్రౌండ్‌లో ఏ జట్టూ ఓడించలేదు. కానీ తొలిసారి భారత్ చేతుల్లో ఆ టీమ్ పరాభవం పాలైంది.


తొలి కెప్టెన్‌గా..

పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది టీమిండియా. కంగారూ గడ్డ మీద భారత జట్టుకు దక్కిన అతిపెద్ద విజయంగా ఇది నిలిచింది. ఇంతకుముందు 1977లో మెల్‌బోర్న్ టెస్ట్‌లో 222 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది మెన్ ఇన్ బ్లూ. తాజా మ్యాచ్‌లో రికార్డు విక్టరీ సాధించి టెస్ట్‌ను చిరస్మరణీయంగా మార్చుకుంది. ఆసీస్‌లోనే కాదు సేన (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లోనూ భారత్ సాధించిన బిగ్గెస్ట్ విక్టరీగా ఇది నిలిచింది. ఓవరాల్‌గా విదేశీ గడ్డపై మూడో అతిపెద్ద విజయంగా చెప్పొచ్చు. పెర్త్ టెస్ట్‌లో బుమ్రా 72 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. విదేశీ గడ్డపై భారత కెప్టెన్ ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అలాగే పెర్త్‌లో మ్యాచ్ గెలిచిన రెండో ఆసియా కెప్టెన్‌గానూ బుమ్రా అరుదైన ఫీట్ నెలకొల్పాడు.


Also Read:

ఆ కుర్రాడి కోసం ముంబై-కేకేఆర్ కొట్లాట.. జాక్‌పాట్ కొట్టేశాడు

తక్కువ ధరకే మొనగాడ్ని పట్టేసిన ముంబై.. రోహిత్‌తో ఓపెనింగ్

పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు

For More Sports And Telugu News

Updated Date - Nov 25 , 2024 | 06:44 PM